News December 29, 2025

నిజామాబాద్: నేషనల్ పారా స్విమ్మింగ్ ఛాంపియన్ షిప్‌ కిరణ్

image

నిజామాబాద్ పట్టణానికి చెందిన శ్రీనికేష్ కిరణ్ 2025-26 సంవత్సరానికి నిర్వహించిన నేషనల్ పారా స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ సాధించాడు. బెస్ట్ స్విమ్మర్ అవార్డును అందుకోవడం భారతదేశానికి గర్వకారణమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని సూచించారు.

Similar News

News January 1, 2026

CM పర్యటనలపై వాస్తవాలు చెప్పాలి: సుధాకర్

image

AP: CM CBN విదేశీ పర్యటనలపై ప్రజలకు వాస్తవాలు చెప్పాలని YCP నేత సుధాకర్‌బాబు డిమాండ్ చేశారు. ‘GADలోనూ సమాచారం లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. దోచుకున్న సొమ్మును దాచుకోవడానికి సింగపూర్ వెళ్లి ఉంటారనే ప్రచారం ఉంది. CM, లోకేశ్, పవన్‌ల పర్యటనల ఖర్చును వెల్లడించాలి. తన సొంత డబ్బుతో మాజీ CM జగన్ స్పెషల్ ఫ్లైట్లో వెళ్తే నానా యాగీ చేసిన CBN CMగా తన పర్యటనను రహస్యంగా ఉంచడంలో మర్మమేమిటి’ అని ప్రశ్నించారు.

News January 1, 2026

సిరిసిల్ల: ఒక్కరోజే రూ.3.10 కోట్ల మద్యం తాగేశారు..!

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక్కరోజులోనే 3 కోట్ల 10 లక్షల రూపాయల విలువైన మద్యం తాగేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 48 మద్యం దుకాణాలు, 8 బార్లలో డిసెంబర్ 31న 2766 పెట్టెల విస్కీ, 3885 పెట్టెల బీర్ల విక్రయం జరగడం ద్వారా మూడు కోట్ల పది రూపాయల ఆదాయం సమకూరింది. డిసెంబరు నెలలో 59,968 పెట్టెలు విస్కీ, 76,974 పెట్టెలు బీర్ల విక్రం ద్వారా 67 కోట్ల 14 లక్షల రూపాయల ఆదాయం సమకూరినట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది.

News January 1, 2026

HYDలో కొత్త ట్రెండ్.. ఇదే బెస్ట్ స్పాట్..!

image

HYD‌లో ఏ వేడుక జరిగినా ఇప్పుడు అందరి చూపు డాక్టర్‌ బీ.ఆర్. అంబేడ్కర్ సెక్రటేరియట్ వైపే ఉంటోంది. IPL‌లో RCB విజయం, న్యూ ఇయర్ వేడుకలను సీపీ సజ్జనార్ ఇక్కడే జరుపుకోవటం విశేషం. సెక్రటేరియట్ అద్భుతమైన నిర్మాణ శైలి, విద్యుత్ వెలుగులతో ఈ ప్రాంతం పర్యాటకానికి ‘బెస్ట్ స్పాట్’గా మారింది. అమరజ్యోతి, భారీ అంబేడ్కర్ విగ్రహం, హుస్సేన్ సాగర్ అందాలను వీక్షించేందుకు సందర్శకులు పోటెత్తుతున్నారు.