News April 24, 2024
తిరుపతి: రైతు కూలి కుమార్తెకు 597 మార్కులు

కలకడ మండలం గరడప్పగారిప్లలెలోని ఏపీ గురుకుల(బాలికలు) పాఠశాల విద్యార్థిని పి.లిఖిత 597 మార్కులు సాధించినట్లు ప్రిన్సిపల్ సుమిత్ర తెలిపారు. తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం కొత్తవేపకుప్ప గ్రామానికి చెందిన సాధారణ రైతు కూలి ఇంటి జన్మించిన పి.లిఖిత రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించడంతో పలువురు అభినందించారు.
Similar News
News January 22, 2026
సెలవుపై వెళ్లిన చిత్తూరు జేసీ

చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ వ్యక్తిగత కారణాలతో సెలవు పెట్టారు. ఈ నెల 21 నుంచి 31వతేదీ వరకు సెలవులో ఉంటారని అధికారులు తెలియజేశారు. జేసీగా ఆయన మంగళవారం బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.
News January 22, 2026
ICOC చిత్తూరు ఛైర్మన్‌గా మనోజ్

ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (MSME) చిత్తూరు జిల్లా ఛైర్మన్‌గా చంద్రగిరి మనోజ్ కుమార్ నియమితులయ్యారు. రొంపిచర్ల(M) చంచంరెడ్డిగారిపల్లికి చెందిన ఈయన్ను BC కోటాలో నియమిస్తూ నేషనల్ జాయింట్ సెక్రటరీ సీమా కిరణ్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోSC, ST, మహిళా అభ్యున్నతికి, పథకాల ద్వారా ప్రయోజనం పొందేందుకు పాటుపడతానని మనోజ్ పేర్కొన్నారు.
News January 22, 2026
చిత్తూరు: రీసర్వేలో రైతుల భాగస్వామ్యం

రీసర్వేలో పలు లోటు పాట్లు చోటు చేసుకుంటుండడంతో వీటిని సరిదిద్దేందుకు ప్రభుత్వం ఇందులో రైతులను భాగస్వామ్యం చేసింది. రీ సర్వే ప్రారంభంలోను, ముగిసిన తర్వాత రైతుల ఈ కేవైసీ తీసుకోవాలని ఆదేశించింది. తద్వారా తప్పులు రైతులు గుర్తించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం నాలుగో విడత రీ సర్వే పలుచోట్ల నిర్వహిస్తున్నారు. 101 గ్రామాలలో 1.15 లక్షల ఎకరాలలో రీ సర్వేను రెవెన్యూ అధికారులు చేపట్టనున్నారు.


