News December 30, 2025

పోక్సో కేసులు 34% వరకు తగ్గుముఖం: సిద్దిపేట సీపీ

image

2025 పోలీస్ శాఖ వార్షిక నివేదికలో పోక్సో కేసుల్లో 34% తగ్గు ముఖం పట్టాయని తెలిపారు. క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్స్ కేసులు 589 నుంచి 572కు తగ్గాయన్నారు. 731 ప్రాపర్టీ ఆఫన్స్ కేసుల్లో ఇప్పటి వరకు రూ.1,42,69,301 వర్త్ ప్రాపర్టీ రికవరీ చేశామన్నారు. 2024తో పోలిస్తే 2025లో మర్డర్ కేసులు 12% తగ్గాయన్నారు. 2024తో పోలిస్తే 2025లో 4% ఎక్కువ సాధారణ కేసులు ఎక్కువగా నమోదయ్యాయని తెలిపారు.

Similar News

News January 14, 2026

ASF: మున్సిపల్ ఎన్నికల నగారా.. గెలుపు గుర్రాల వేట

image

ఆసిఫాబాద్ జిల్లాలో 2 మున్సిపాలిటీలు ఉన్నాయి. వాటిని కైవసం చేసుకునేందుకు ప్రధాన పార్టీలు గెలుపు గుర్రాల అన్వేషణలో పడ్డాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. మున్సిపాలిటీలపై కాంగ్రెస్ జెండా ఎగరవేసేందుకు ఆ పార్టీ నేతలు వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. ప్రధాన పార్టీలు సైతం పక్కా ప్రణాళికలు రచిస్తున్నాయి.

News January 14, 2026

కోడి పందేల హోరు: గెలిస్తే బుల్లెట్, కారు బహుమతి!

image

గోదావరి జిల్లాల్లో సంక్రాంతి కోడి పందేలు రసవత్తరంగా సాగుతున్నాయి. పందెం రాయుళ్లను ఆకర్షించేందుకు నిర్వాహకులు భారీ బహుమతులు ప్రకటిస్తున్నారు. 6 పందేలు వరుసగా గెలిచిన పుంజుల యజమానులకు బుల్లెట్ బైకులు, కొన్ని చోట్ల ఏకంగా లగ్జరీ కార్లను బహుమతులుగా అందజేస్తున్నారు. దీంతో బరుల వద్ద సందడి నెలకొంది. చట్టపరమైన ఆంక్షలు ఉన్నప్పటికీ రూ.కోట్లాది బెట్టింగ్‌లు, ఖరీదైన ఆఫర్లతో పందెం కోళ్లు కాలుదువ్వుతున్నాయి.

News January 14, 2026

HYDద్‌లో ‘ఫిన్లాండ్’ చదువుల జోరు

image

మన పిల్లలకు ఇక ఫిన్లాండ్ రేంజ్ చదువులు HYDలోనే దొరికేస్తాయోచ్! కొల్లూరులో సౌత్ ఇండియాలోనే మొట్టమొదటి ఫిన్లాండ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ స్కూల్‌ను ‘హారిజన్ ఎక్స్‌పీరియెన్షియల్ వరల్డ్ స్కూల్’ (HEWS) ప్రారంభించింది. ప్రపంచంలోనే నం.1 విద్యా విధానాన్ని మన దగ్గరకు తెస్తూ టీసీసీ క్లబ్‌లో వేడుక నిర్వహించారు. బట్టీ పద్ధతులకు స్వస్తి చెప్పి, పిల్లల్లో సృజనాత్మకత పెంచడమే లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.