News December 30, 2025
మెదక్ జిల్లాలో పుష్కలంగా యూరియా: కలెక్టర్

మెదక్ జిల్లాలో రైతుల అవసరాలకు సరిపడా యూరియా పుష్కలంగా అందుబాటులో ఉందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. 2025 అక్టోబర్ నుంచి 2026 జనవరి వరకు జిల్లాకు 12 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా, ముందస్తు చర్యలతో ఇప్పటికే 12,673 మెట్రిక్ టన్నులు జిల్లాకు చేరుకున్నాయని చెప్పారు. ఇప్పటి వరకు 7,343 మెట్రిక్ టన్నులు పంపిణీ కాగా ఇంకా 5,330 మెట్రిక్ టన్నులు నిల్వలో ఉన్నాయని వెల్లడించారు.
Similar News
News January 2, 2026
నర్సాపూర్ బీవీఆర్ఐటీలో టెట్ పరీక్షా కేంద్రం

తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG-TET)పరీక్షను జిల్లాలో నర్సాపూర్ BVRITలో ఏర్పాటు చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి విజయ తెలిపారు. ఈనెల 4న ఉ.9 నుంచి 11.30 గంటల వరకు, మ.2 నుంచి సా.4.30 గంటల వరకు నిర్వహిస్తామన్నారు. మొత్తం 400 మంది అభ్యర్థులు హాజరు కానున్నారన్నారు. హాల్ టికెట్లను https://tgtet.aptonline.in/tgtet వెబ్‌సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చన్నారు.
News January 2, 2026
మెదక్: ‘విద్యావంతులే బలవుతున్నారు’

మెదక్‌లో సైబర్ వారియర్స్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. విద్యావంతులే ఎక్కువగా సైబర్ మోసాలకు బలవుతున్నారని, అవగాహన లోపం, అత్యాశే కారణమని పోలీసులు తెలిపారు. APK ఫైళ్లు, అనధికారిక లోన్ యాప్‌లు, పెట్టుబడి, ఆన్‌లైన్ బెట్టింగ్, డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లపై అవగాహన కల్పించారు. అనుమానాస్పద లింకులు క్లిక్ చేయవద్దని, సైబర్ నేరాలకు గురైతే 1930 లేదా cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలన్నారు.
News January 1, 2026
మెదక్: ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి: కలెక్టర్

ప్రజలందరూ ఆనందంగా సుఖసంతోషాలతో పాడిపంటలతో ఉండాలని కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. నూతన సంవత్సరం పురస్కరించుకొని మెదక్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కుటుంబ సమేతంగా దర్శించుకుని పూజలు నిర్వహించారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలిగి ఉండాలని భగవంతుని ప్రార్థించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.


