News December 30, 2025

జనవరి 3న కొండగట్టుకు పవన్ కళ్యాణ్.. షెడ్యూల్ ఇదే!

image

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టు పర్యటన ఖరారైంది. జనవరి 3న ఉ.9:30కి హెలికాప్టర్ ద్వారా HYD నుంచి కొండగట్టు సమీపంలోని జేఎన్‌టీయూకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానాలు నిధులతో నిర్మిస్తున్న 100 గదుల వసతి గృహాల శంకుస్థాపనలో పాల్గొని మధ్యాహ్నం ఒంటి గంటకు హైదరాబాద్‌కు తిరిగి వెళ్తారు.

Similar News

News January 2, 2026

అరకు: ఆస్పత్రి బాత్రూంలో మహిళ డెలివరీ

image

అరకులోయ ఏరియా ఆస్పత్రి బాత్రుంలో శుక్రవారం గుర్తు తెలియని శిశువు మృతదేహం ఉండటం కలకలం రేగింది. బాత్రూంలో గురువారం రాత్రి గుర్తుతెలియని మహిళ చనిపోయిన శిశువుకు జన్మనిచ్చి, అనంతరం ఎవరికి తెలియకుండా ఆస్పత్రి నుంచి వెళ్లిపోయింది. ఆస్పత్రి సిబ్బంది శుక్రవారం ఉదయం బాత్రూంలో నవజాత శిశువు ఉన్నట్లు గుర్తించారు. CC ఫుటేజ్‌లను పరిశీలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News January 2, 2026

సంగారెడ్డి: 1,492 మంది కుష్టు అనుమానితులు

image

సంగారెడ్డి జిల్లాలో డిసెంబర్ 18 నుంచి 31వ తేదీ వరకు కుష్టు వ్యాధి సర్వే నిర్వహించినట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ వసంత రావు శుక్రవారం తెలిపారు. 1,492 మంది కుష్టు వ్యాధి అనుమానితులను గుర్తించినట్లు చెప్పారు. 9 మందికి వ్యాధిని గుర్తించినట్లు పేర్కొన్నారు. ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు ఇంటింటికి తిరిగి సర్వే చేసినట్లు చెప్పారు.

News January 2, 2026

IIIT పుణేలో రీసెర్చ్ పోస్టులు

image

<>IIIT<<>> పుణే 9 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అనుసంధన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్-పార్ట్‌నర్‌షిప్స్ ఫర్ యాక్సిలరేటెడ్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఇన్షియేటివ్‌లో భాగంగా సైబర్ సెక్యూరిటీ పరిశోధన కోసం వీటిని భర్తీ చేయనుంది. పోస్టును బట్టి PhD, ME/MTech/MCA, BE/B.Tech, MSc, GATE/NET ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు జనవరి 14వరకు అప్లై చేసుకోవచ్చు. వెబ్‌సైట్: https://www.iiitp.ac.in/