News December 30, 2025
మనోహరాబాద్: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

మనోహరాబాద్ మండలం జీడిపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చేగుంట మండలం చిన్న శివునూరు గ్రామానికి చెందిన మల్లప్పగారి హేమంత్ సాయి (21) మృతిచెందినట్లు ఎస్ఐ సుభాష్ గౌడ్ తెలిపారు. హేమంత్ సాయి శనివారం రాత్రి కుక్కదువు ప్రవీణ్ (20), మధ్యప్రదేశ్‌కు చెందిన కుల్దీప్‌తో కలిసి బైక్‌పై మేడ్చల్ బయలుదేరారు. మార్గమధ్యంలో ముందు వెళ్తున్న వాహనం ఢీకొట్టడంతో హేమంత్ సాయి మృతిచెందగా, ఇరువురు గాయపడ్డారు.
Similar News
News January 1, 2026
మెదక్: భార్యను హత్య చేసిన భర్త.. జీవిత ఖైదు

తూప్రాన్ మండలం వెంకటాయపల్లి గ్రామంలో భార్య నాగరాణిను హత్య చేసిన భర్త ఊషణగళ్ల చంద్రం అనే వ్యక్తికి జీవిత ఖైదు, రూ.10 వేల జరిమానా విధిస్తూ జిల్లా న్యాయమూర్తి నీలిమ తీర్పునిచ్చినట్లు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. 2021 ఆగస్టు 27న దంపతుల మధ్య గొడవ జరగగా భార్యను భర్త కొట్టి హత్య చేసినట్లు నిర్ధారణ కావడంతో జైలు శిక్ష విధించినట్లు వివరించారు. శిక్ష పడేందుకు కృషిచేసిన సిబ్బందిని అభినందించారు.
News January 1, 2026
మెదక్: ముగ్గురు పోలీస్ అధికారులకు సేవ పథకాలు

మెదక్ జిల్లాకు చెందిన ముగ్గురు పోలీస్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం సేవ పథకాలను ప్రకటించింది. మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్‌కు ఉత్తమ సేవ పథకం, ఎస్ఐ విఠల్‌కు సేవ పథకం, మెదక్ టౌన్ ఏఎస్ఐ రుక్సానా బేగంకు సేవ పథకం ప్రకటించారు. ఎంపికైన అధికారులను ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు అభినందించారు. భవిష్యత్‌లో కూడా ఇదే విధంగా ప్రజాసేవలో అంకితభావంతో పనిచేసి పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
News January 1, 2026
మెదక్: నేటి నుంచి పోలీస్ యాక్ట్: ఎస్పీ

మెదక్ జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని జనవరి 1 నుంచి 31 వరకు నెల రోజుల పాటు 30, 30 ఏ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా అనుమతి లేనిది ఎలాంటి రాస్తారోకోలు, ధర్నాలు, ర్యాలీలు, ఊరేగింపులు చేయరాదని తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.


