News December 30, 2025
2025లో ఎన్ని డ్రంక్&డ్రైవ్ కేసులు నమోదయ్యాయంటే..!

రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగంగా బాపట్ల జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్‌పై చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ ఉమామహేశ్వర్ తెలిపారు. 2025లో మొత్తం 10,833 డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్ కేసులు నమోదు చేశామని చెప్పారు. హెల్మెట్ వినియోగం, ఓవర్ స్పీడ్, మద్యం తాగి వాహనం నడిపడం వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.
Similar News
News January 31, 2026
RGM: కోల్ బెల్ట్‌లో సింహం గుర్తు భలే క్రేజీ

రామగుండం కార్పొరేషన్‌లో ఎన్నికల ప్రచార సరళి మొదలైంది. ఇప్పటికే ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేసిన అభ్యర్థులు సింహం వేటలో పడ్డారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్(AIFB), HMS, జాగృతి సంయుక్తంగా సింహం గుర్తును కేటాయించింది. అయితే ఇప్పటికే చాలావరకు అభ్యర్థులు AIFBపైన నామినేషన్ వేశారు. గతంలో సాధారణ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికల్లో సింహం దే ఇక్కడ హవా నడిచింది. అందుకే సింహం అంటే ఇక్కడ భలే క్రేజీ.
News January 31, 2026
శ్రీకాకుళం: దిగొచ్చిన కోడిగుడ్డు

శ్రీకాకుళం జిల్లాలో ఈ నెల మొదటి వారంలో కొండెక్కిన కోడి గుడ్ల ధర ఎట్టకేలకు సామాన్యుడికి అందుబాటులోకి వచ్చింది. న్యూ ఇయర్ సీజన్ ప్రారంభంలో గరిష్ఠంగా ఒక్కో గుడ్డు రూ.10 రికార్డ్ ధరకు చేరింది. డిమాండ్‌కి తగ్గ సప్లై లేకపోవటం, గుడ్ల ఉత్పత్తి తగ్గటం దీనికి కారణం. ప్రస్తుతం గుడ్ల ఉత్పత్తి, సరఫరా మెరుగుపడటంతో ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో ఒక గుడ్డు రూ. 5.50 – రూ.6 ఉందని వ్యాపారులు తెలిపారు.
News January 31, 2026
కరీంనగర్: ముగిసిన నామినేషన్ల ప్రక్రియ.. ఆశావహుల్లో ఉత్కంఠ..!

కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. ప్రతి డివిజన్ నుంచి కాంగ్రెస్, BJP, BRS బీఫాం ఆశించే అభ్యర్థులు భారీగానే ఉన్నారు. దీంతో బీ-ఫారం ఎవరికి దక్కుతుందనే చర్చ జోరుగా సాగుతోంది. ఇప్పటికే పలువురు అభ్యర్థులు తమకు సీటు ఖరారైందని ప్రచారం చేసుకుంటున్నారు. కానీ, ఇప్పటికీ ఏ పార్టీ అధికారికంగా ప్రకటించలేదు. బీ ఫాం 2 రోజుల్లో అందించే అవకాశం ఉంది.


