News December 30, 2025

కంకి ఎర్రనైతే కన్ను ఎర్రనౌతుంది

image

వరి పంట పండే సమయంలో కంకి (వరి వెన్ను) సహజంగా బంగారు వర్ణంలో ఉండాలి. కానీ, విపరీతమైన వర్షాలు కురిసినా లేదా ఏదైనా తెగులు సోకినా కంకులు ఎర్రగా మారిపోతాయి. దీనివల్ల ధాన్యం నాణ్యత దెబ్బతింటుంది. కష్టపడి పండించిన పంట కళ్లముందే పాడైపోవడం చూసి రైతు కన్ను ఎర్రనౌతుంది (అంటే దుఃఖంతో కన్నీళ్లు వస్తాయి). పంట దిగుబడి, స్థితికి.. రైతు మనస్తత్వానికి మధ్య ఉన్న సంబంధాన్ని ఈ సామెత తెలియజేస్తుంది.

Similar News

News December 31, 2025

నిమ్మకాయ దీపాన్ని ఎప్పుడు వెలిగించాలి?

image

రాహుకాలంలో మాత్రమే వెలిగించాలి. మంగళవారం ఉత్తమం. శుక్రవారం అంతకన్నా ఉత్తమం. అయితే శుభ దినాల్లో, ఉపవాసం ఉండే రోజుల్లో వెలిగించకూడదు. పండుగ రోజున, పెద్దల తిథి ఉన్నప్పుడు, ఇంట్లో జన్మదినాలు, జయంతి, పెళ్లిరోజులప్పుడు నిషిద్ధం. ఈ పరిహారం పాటిస్తే ఆరోజున ఊరు దాటి వెళ్లకూడదు. పట్టుచీర ధరించి వెలిగిస్తే ఎక్కువ ఫలితముంటుంది. ఈ దీపం పెడితే ఇతర దీపాలేవీ వెలిగించకూడదు. ఎరుపు, పసుపు రంగు వస్త్రాలు ధరించాలి.

News December 31, 2025

భారత్, పాక్ మధ్య మీడియేషన్.. చైనా సంచలన ప్రకటన

image

ఇండియా, పాక్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు తాము మీడియేషన్ చేశామని చైనా సంచలన ప్రకటన చేసింది. ‘ప్రపంచంలో అస్థిరత తీవ్రంగా పెరిగింది. ఘర్షణలను ఆపేందుకు చైనా న్యాయమైన వైఖరి అవలంబించింది. ఇండియా-పాక్, పాలస్తీనా-ఇజ్రాయెల్, కాంబోడియా-థాయిలాండ్ వివాదాల్లో మధ్యవర్తిత్వం వహించాం’ అని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ చెప్పారు. భారత్, పాక్ యుద్ధం తానే ఆపానని US అధ్యక్షుడు ట్రంప్‌ చెప్పుకుంటుండటం తెలిసిందే.

News December 31, 2025

నిద్ర లేవగానే చూడాల్సిన వస్తువులు

image

ఉదయం నిద్ర లేవగానే కొన్ని వస్తువులను చూడటం వల్ల ఆ రోజంతా శుభం జరుగుతుంది. ప్రధానంగా బంగారం, ఉదయించే సూర్యుడు, ఎర్ర చందనం చూడటం అత్యంత శుభప్రదం. అలాగే ఆలయ గోపురం, పర్వతం, దూడతో ఉన్న ఆవు, కుడిచేయి, ధర్మపత్ని, చిన్నపిల్లలను చూడటం వల్ల కూడా సానుకూల శక్తి లభిస్తుంది. ఇవి మనసులో ప్రశాంతతను నింపి, రోజంతా చేసే పనులలో విజయాన్ని, ఐశ్వర్యాన్ని, మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని నమ్ముతారు.