News April 24, 2024

జగన్ కుమార్తెలకు విదేశాల్లో ఆస్తులు

image

AP: CM జగన్‌ కుటుంబ ఆస్తి రూ.774.88 కోట్లు కాగా ఆయన కూతుళ్లు హర్షిణిరెడ్డికి రూ.1.31 కోట్లు, వర్షారెడ్డికి రూ.1.54 కోట్ల విలువైన విదేశీ ఆస్తులున్నాయి. CM సతీమణి భారతీరెడ్డికి 11 కంపెనీల్లో రూ.53 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, జియో ఫైనాన్షియల్స్, NMDC, ఏషియన్ పెయింట్స్, కోల్గేట్ పామోలిన్, ONGC, సెయిల్, అల్ట్రాటెక్ సిమెంట్ సంస్థల్లో రూ.1.52 కోట్ల పెట్టుబడులు పెట్టారు.

Similar News

News March 19, 2026

AP జాబ్ క్యాలెండర్: విభాగాలు.. పోస్టుల వివరాలు

image

* మే 15: ఉన్నత విద్యలో 1500 <<19422391>>పోస్టులు<<>>
* ఆగస్టు 15: గ్రూప్ I – 91, హోం శాఖ – 2,778, ఇతర శాఖలు – 928
* సెప్టెంబర్ 15: గ్రూప్-II – 750, ఇంజినీరింగ్ – 503, ఇతర శాఖలు – 506
* అక్టోబర్ 15: పాఠశాల/ఇంటర్ విద్య – 3004
** మొత్తం ఉద్యోగాలు – 10,060
-SHARE IT

News March 19, 2026

ఇకపై AP సేవ పోర్టల్‌తో వారికి పథకాలు

image

AP: భవన నిర్మాణ, ఇతర కార్మికులకు సంక్షేమ పథకాలను వేగంగా, పారదర్శకంగా AP సేవ పోర్టల్‌ ద్వారా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వివాహ కానుక, ప్రసూతి ప్రయోజనం, సహజ మరణం పథకం, అంత్యక్రియల సమయంలో ఆర్థికసాయం అందించేందుకు ఓకే చెప్పింది. ఈ 4 పథకాల అమలుకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నెల 1వ తేదీ నుంచి ఈ పథకాలు అమల్లోకి వచ్చాయని.. గ్రామ, వార్డు సచివాలయాల్లో నమోదు చేసుకోవాలని సూచించింది.

News March 19, 2026

‘ఉస్తాద్ భగత్ సింగ్’ పబ్లిక్ టాక్

image

డైరెక్టర్ హరీశ్ శంకర్ పవన్ కళ్యాణ్‌ అభిమానులను అలరించేలా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ను తెరకెక్కించారని బెనిఫిట్ షో చూసిన పలువురు ప్రేక్షకులు తెలిపారు. పదునైన మాస్ డైలాగ్స్ ఆకట్టుకుంటాయన్నారు. పవన్ ఎనర్జీ, డాన్సులు ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తాయని పేర్కొన్నారు. కథలో కొత్తదనం లేకపోవడం నిరాశ పరుస్తుందని మరికొందరు అన్నారు. కాసేపట్లో Way2News రివ్యూ&రేటింగ్.