News April 24, 2024

చీరాల: తల్లి కళ్లెదుటే ఏడాది కూతురు మృతి

image

చీరాల-వేటపాలెం బైపాస్ రోడ్డులో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి చెందారు. స్నేహలత తన తల్లి, కూతరితో కలిసి చిన్నగంజాం నుంచి బాపట్ల వెళ్తుండగా లారీని తప్పించబోయి కింద పడ్డారు. అదే సమయంలో లారీ వారిపై ఎక్కడంతో అన్విత(1), బోడు సుబ్బారావమ్మ(45) అక్కడికక్కడే మృతిచెందారు. తన కళ్లెదుటే కూతురు, తల్లిని కోల్పోవడంతో స్నేహలత ఆవేదన వర్ణణాతీతంగా మారింది.

Similar News

News March 3, 2026

వెలుగొండ నిర్వాసితులకు న్యాయం ఏది..?

image

వెలుగొండ ప్రాజెక్టు కింద ముంపుకు గురైన గ్రామాల నిర్వాసితులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు పరిధిలో 11 గ్రామాలు ముంపుకు గురికానుండగా.. పెద్దారవీడు మండలంలోని సుంకేసుల, కలనూతల, గుండంచెర్ల గ్రామాల పరిస్థితి దయనీయంగా ఉందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ఈ వ్యవహారంపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు.

News March 3, 2026

ప్రకాశం SP కార్యాలయానికి 80 అర్జీలు

image

ప్రకాశం జిల్లా SP కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. SP హర్షవర్ధన్ రాజు ప్రజల నుంచి వచ్చిన 80 వినతి పత్రాలను స్వీకరించారు. సంబంధిత PS అధికారులతో మాట్లాడి చట్టబద్ధంగా సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఫిర్యాదుదారులతో మాట్లాడుతూ.. వారి సమస్యలు పరిశీలించి న్యాయం చేస్తానని భరోసా కల్పించారు. అధికంగా భూ, ఆర్థిక తగాదాలు, అత్తింటి వేధింపులు, ఉద్యోగ మోసాలు వంటివి వచ్చాయన్నారు.

News March 2, 2026

10th పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలి: ప్రకాశం JC

image

ప్రకాశం జిల్లాలో ఈనె ల 16వ తేదీ నుంచి 10th పబ్లిక్ పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పటిష్టంగా పరీక్షలకు ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి సోమవారం అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యంగా పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేసి, విద్యార్థులకు తాగునీరు, రవాణా సౌకర్యాలు కల్పించాలన్నారు.