News December 30, 2025
మేడారంలో మాకు ఏందీ ఈ గోస!

మేడారం జాతరకు మరో 30 రోజుల సమయం ఉంది. సంక్రాంతి తర్వాత మేడారంలో పోలీసు బందోబస్తు క్యాంపు ఏర్పాటు చేస్తారు. ములుగు జిల్లా ఆర్ముడ్ పోలీసులు ఇప్పటి నుంచే క్యాంపు పెట్టాలంటూ ఆదేశాలు రావడంతో సిబ్బంది ఇంత అడ్వాన్సుగా మమ్మల్ని ఇబ్బంది ఎందుకు పెడుతున్నారంటూ ఆవేదన చెందుతున్నారు. ఉష్ణోగ్రత 10 డిగ్రీలు ఉండటంతో ఇబ్బంది పడుతున్నట్టు వారంటున్నారు. పూర్తి సౌకర్యాలు కల్పించాకే బందోబస్తు పెట్టాలని వారంటున్నారు.
Similar News
News January 2, 2026
BRS నిర్ణయంతో సభకు కేసీఆర్ రానట్లే

TG: BRS చీఫ్ KCR శాసనసభకు హాజరుకారని తేలిపోయింది. పాలమూరు ప్రాజెక్టు, కృష్ణా జలాలపై ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన KCR తొలిరోజు సభలో 3 ని.లు మాత్రమే ఉన్నారు. ఇవాళ రెండో రోజు సమావేశానికీ హాజరు కాలేదు. మరోవైపు ప్రస్తుత సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు BRS కూడా ప్రకటించడంతో ఇక రారనేది స్పష్టమైంది. కాగా కేసీఆర్ సభకు వస్తారని భావించి కాంగ్రెస్ సిద్ధమైంది. ఆయన సభకు రాకపోవడాన్ని CM రేవంత్ తప్పుబట్టారు.
News January 2, 2026
అరకు: ఆస్పత్రి బాత్రూంలో మహిళ డెలివరీ

అరకులోయ ఏరియా ఆస్పత్రి బాత్రుంలో శుక్రవారం గుర్తు తెలియని శిశువు మృతదేహం ఉండటం కలకలం రేగింది. బాత్రూంలో గురువారం రాత్రి గుర్తుతెలియని మహిళ చనిపోయిన శిశువుకు జన్మనిచ్చి, అనంతరం ఎవరికి తెలియకుండా ఆస్పత్రి నుంచి వెళ్లిపోయింది. ఆస్పత్రి సిబ్బంది శుక్రవారం ఉదయం బాత్రూంలో నవజాత శిశువు ఉన్నట్లు గుర్తించారు. CC ఫుటేజ్‌లను పరిశీలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News January 2, 2026
సంగారెడ్డి: 1,492 మంది కుష్టు అనుమానితులు

సంగారెడ్డి జిల్లాలో డిసెంబర్ 18 నుంచి 31వ తేదీ వరకు కుష్టు వ్యాధి సర్వే నిర్వహించినట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ వసంత రావు శుక్రవారం తెలిపారు. 1,492 మంది కుష్టు వ్యాధి అనుమానితులను గుర్తించినట్లు చెప్పారు. 9 మందికి వ్యాధిని గుర్తించినట్లు పేర్కొన్నారు. ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు ఇంటింటికి తిరిగి సర్వే చేసినట్లు చెప్పారు.


