News December 30, 2025

థైరాయిడ్ టాబ్లెట్స్ వేసుకున్నాక ఎప్పుడు ఫుడ్ తీసుకోవాలంటే?

image

థైరాయిడ్ మందులను ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆ తర్వాత యాభై నిమిషాల తర్వాత ఫుడ్ తీసుకోవాలని చెబుతున్నారు. అప్పుడే శరీరం మందును బాగా గ్రహిస్తుంది. అలాగే థైరాయిడ్ టాబ్లెట్లు వేసుకున్న గంట వరకు థైరాయిడ్ మందుల శోషణకు అంతరాయం కలిగించే యాంటాసిడ్లు, ఇతర మందులను వేసుకోవడం, ఫైబర్, కాల్షియం, ఐరన్ అధికంగా ఉండే ఆహారాలు తినడం మానుకోవాలని సూచిస్తున్నారు.

Similar News

News January 16, 2026

నల్గొండ: ఉద్యోగాల పేరిట రూ.85 లక్షల మోసం

image

విదేశాల్లో చదువు, ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న గుంటూరుకు చెందిన ముప్పాళ్ల లీలాకృష్ణను చింతపల్లి పోలీసులు అరెస్ట్ చేసినట్లు అడిషనల్ డీఎస్పీ రమేశ్ తెలిపారు. పోలేపల్లికి చెందిన కరుణభాయ్ ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టి, నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడి నుంచి ల్యాప్‌టాప్, మూడు ఫోన్లు, డెబిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ.85 లక్షల మేర మోసం చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.

News January 16, 2026

రోహిత్‌ కెప్టెన్సీకి గంభీర్ చెక్.. మనోజ్ తివారీ సంచలన ఆరోపణలు!

image

ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినా రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తీసేయడం వెనుక కోచ్ గంభీర్ హస్తం ఉండొచ్చని మనోజ్ తివారీ అనుమానం వ్యక్తం చేశారు. అగార్కర్ కోచ్ ప్రభావానికి లోనై ఉండొచ్చేమోనని, రోహిత్ లాంటి లెజెండ్‌ను పక్కన పెట్టడం క్రీడా ధర్మానికి విరుద్ధమన్నారు. 2027 వరల్డ్ కప్ ఆడగల సత్తా ఉన్న హిట్‌మ్యాన్‌ను కాదని గిల్‌కు బాధ్యతలు ఇవ్వడంలో లాజిక్ లేదన్నారు. ఇది రోహిత్‌ను అవమానించడమేనని ఫైర్ అయ్యారు.

News January 16, 2026

APFIRST పేరుతో తిరుపతిలో రీసెర్చ్ సెంటర్

image

AP ఫ్యూచరిస్టిక్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ(APFIRST) పేరిట తిరుపతిలో రీసెర్చ్ కేంద్రం ఏర్పాటు కానుంది. ఏరో స్పేస్-డిఫెన్స్, ఐటీ-డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ సమావేశంలో CM CBN దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ‘ఏరో స్పేస్, డిఫెన్స్, స్పేస్, క్వాంటం, బయో టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ కీలకం కానున్నాయి. ఈదిశగా పాలసీలు పెడుతున్నాం. IIT-IISER ఆధ్వర్యంలో ఇది ఏర్పాటు కానుంది’ అని తెలిపారు.