News December 30, 2025
భద్రాద్రి జిల్లాలో మరోసారి ఎన్నికలు

భద్రాద్రి జిల్లాలో మరోసారి ఎన్నిక సందడి నెలకొననుంది. జిల్లాలోని 3 మున్సిపాలిటీల్లో పోలింగ్‌కు అధికారులు సిద్ధం అవ్వాలని ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం.. కొత్తగూడెం కార్పొరేషన్ – 60 వార్డులు 1,70,897 మంది జనాభా, ఇల్లందు-24 వార్డుల్లో 33,732మంది, అశ్వారావుపేట- 22 వార్డుల్లో 20,040మంది ఉన్నారు. ఓటర్ల జాబితా అధికారులు సిద్ధం చేయనున్నారు.
Similar News
News January 1, 2026
భద్రాద్రి: విద్యార్థులకు అలర్ట్.. స్కాలర్‌షిప్ గడువు పెంపు.!

విద్యార్థులకు ప్రభుత్వం అందజేసే ఉపకార వేతనాల దరఖాస్తు గడువును వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగించినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి శ్రీలత వెల్లడించారు. 2025-26 విద్యా సంవత్సరానికి గాను కొత్తగా దరఖాస్తు చేసుకునే వారు, రిన్యూవల్ చేసుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు ఈ అవకాశాన్ని వాడుకోవాలన్నారు. ఈ-పాస్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలన్నారు.
News January 1, 2026
జనవరి 1: చరిత్రలో ఈరోజు

1892: స్వాతంత్ర్య సమరయోధుడు మహదేవ్ దేశాయ్ జననం
1894: గణిత శాస్త్రవేత్త సత్యేంద్రనాథ్ బోస్ జననం
1911: స్వాతంత్ర్య యోధురాలు ఎల్లాప్రగడ సీతాకుమారి జననం
1975: నటి సోనాలి బింద్రే జననం
1979: నటి విద్యాబాలన్ జననం
1955: శాస్త్రవేత్త శాంతిస్వరూప్ భట్నాగర్ మరణం (ఫొటోలో)
1994: తెలుగు రచయిత చాగంటి సోమయాజులు మరణం (ఫొటోలో)
2007: తెలుగు సినీ నిర్మాత డూండీ మరణం
News January 1, 2026
ఈడీ సోదాల్లో నోట్ల కట్టలు.. సూట్‌కేస్ నిండా ఆభరణాలు!

ఢిల్లీలో జరిపిన సోదాల్లో భారీగా నగదు, బంగారు ఆభరణాలను ED గుర్తించింది. ఓ సూట్‌కేసులో ₹8.8 కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలు ఉన్నాయి. మరోవైపు ₹5 కోట్ల నగదుతోపాటు ₹35 కోట్ల ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకుంది. మనీ లాండరింగ్ కేసులో ఇంద్రజిత్ సింగ్ యాదవ్ అనే వ్యక్తి నివాసంలో ఈడీ సోదాలు చేపట్టింది. హరియాణాకు చెందిన ఇంద్రజిత్ సెటిల్‌మెంట్లు, బెదిరింపు వంటి కేసుల్లో నిందితుడు. UAEలో పరారీలో ఉన్నాడు.


