News April 24, 2024
చీరాల ముక్కోణపు పోరులో గెలిచేదెవరు?

AP: దిగ్గజ రాజకీయ నేత కొణిజేటి రోశయ్య ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం ఇది. రాష్ట్రంలో ఈసారి ముక్కోణపు పోరు జరిగే సెగ్మెంట్లలో ఇదొకటి. కరణం వెంకటేశ్(YCP), మాలకొండయ్య యాదవ్(TDP), ఆమంచి కృష్ణమోహన్(INC) తలపడనున్నారు. దీంతో పోటీ రసవత్తరంగా ఉండనుంది. ఎవరు గెలిచినా స్వల్ప మెజార్టీనే ఉంటుందని అంచనా. ఇక్కడ INC 7సార్లు, TDP 5సార్లు, జనతా పార్టీ, కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ, CPI ఒక్కోసారి గెలిచాయి.
<<-se>>#ELECTIONS2024<<>>
Similar News
News September 15, 2025
భారత్ విక్టరీ.. ముఖం చాటేసిన పాక్ కెప్టెన్

భారత్ చేతిలో ఘోర ఓటమో, షేక్ హ్యాండ్స్ ఇవ్వలేదనో పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అఘా బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడకుండా ముఖం చాటేశారు. పీసీబీ ఆదేశాలతోనే ఆయన ఈ సెర్మనీకి గైర్హాజరైనట్లు తెలుస్తోంది. సంప్రదాయం ప్రకారం మ్యాచ్ ముగిసిన వెంటనే ఓడిన జట్టు కెప్టెన్ బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడతారు. మరోవైపు షేక్ హ్యాండ్స్ ఇవ్వకుండా భారత్ క్రీడాస్ఫూర్తిగా విరుద్ధంగా ప్రవర్తించిందని పాక్ ACAకు ఫిర్యాదు చేసింది.
News September 15, 2025
రాబోయే రెండు గంటల్లో వర్షం

ఏపీలోని ఉమ్మడి కృష్ణా, గోదావరి జిల్లాల్లో రాబోయే 2 గంటల్లో ఉరుములు, మెరుపులతో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. ఈ సమయంలో ప్రజలు బయటకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. TGలోని సంగారెడ్డి, వికారాబాద్, HYD, RR, కామారెడ్డి, MDK, SDPT, SRPT, NLG, KMM, కొత్తగూడెం, భువనగిరి, HNK, SRCL, జగిత్యాల, KNR, ADLB, NZMBలో సాయంత్రం తర్వాత పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు.
News September 15, 2025
ఉద్దేశపూర్వకంగానే బకాయిల ఎగవేత: కవిత

TG: కాంగ్రెస్ కమీషన్ల సర్కారు అమ్మాయిల చదువులను కాలరాస్తోందని కల్వకుంట్ల కవిత ఫైరయ్యారు. కావాలనే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఎగవేస్తోందని దుయ్యబట్టారు. 20% కమీషన్లు ఇస్తేనే బకాయిలు చెల్లిస్తామని ప్రభుత్వంలోని కొందరు డిమాండ్ చేస్తున్నారని కాలేజీల యాజమాన్యాలు ఆవేదన చెందుతున్నాయని ఆరోపించారు. ఇందిరమ్మ రాజ్యం అంటూ గొప్పలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆడబిడ్డలను చదువుకు దూరం చేస్తోందని విమర్శించారు.