News December 30, 2025

రాయికల్‌లో యాక్సిడెంట్.. యువకుడి మృతి

image

రోడ్డుకు ఇరువైపులా ఉన్న రేయిలింగ్‌ను ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన రాయికల్ మండలంలోని భూపతిపూర్ ఎక్స్ రోడ్ వద్ద సోమవారం జరిగింది. చింతలూరుకు చెందిన భూమేష్(22), దినేష్(18) బైకుపై వెళ్తున్నారు. డ్రైవింగ్ చేస్తున్న భూమేష్ రోడ్డు పక్కనున్న రేయిలింగ్‌ను గుద్దాడు. దీంతో బండి స్కిడై భూమేష్ మృతి చెందాడు. దినేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఇతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News January 2, 2026

న్యూ ఇయర్ సంబరాలు.. కడప జిల్లాలో ఎంత తాగారంటే.!

image

*కడపలో రూ.1.74 కోట్లు (మద్యం1988, బీరు 1108 కేసులు)
*ప్రొద్దుటూరు రూ.1.63 కోట్లు (2164-910 కేసులు)
*బద్వేల్ రూ.86.09 లక్షలు (1152-364 కేసులు)
*జమ్మలమడుగు రూ.40.90 లక్షలు (611-130)
*ముద్దనూరు రూ.40.73 లక్షలు (566-268)
*మైదుకూరు రూ.79.97 లక్షలు (1187-417)
*పులివెందుల రూ.81.18 లక్షలు (1130-481 కేసులు)
*సిద్దవటం రూ.13.84 లక్షలు (214-82)
*ఎర్రగుంట్ల రూ.43.23 లక్షలు (645-230 కేసులు తాగారు.

News January 2, 2026

జిల్లా అభివృద్ధికి సమన్వయంతో ముందుకు: కలెక్టర్

image

జిల్లా అభివృద్ధి కోసం ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ముందుకు నడవాలని కలెక్టర్ దివాకర అభిప్రాయపడ్డారు. పంచాయతీరాజ్ రాష్ట్ర డైరెక్టర్‌గా నియమితుడైన బైరెడ్డి భగవాన్ రెడ్డి కలెక్టర్‌ను కలిసి పుష్పగుచ్ఛం, శాలువాతో సన్మానించారు. ప్రజలకు, ప్రభుత్వానికి అనుసంధానకర్తలుగా పని చేస్తామని, అధికారులు సహకారం అందించాలని భగవాన్ రెడ్డి కోరారు.

News January 2, 2026

ఆ ప్రొసీడింగ్స్ అమలు కావడం లేదు: ఎల్.రమణ

image

ఉత్తర తెలంగాణలో అతిపెద్ద పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయమని ఎమ్మెల్సీ L.రమణ పేర్కొన్నారు. మండలిలో మాట్లాడుతూ.. యాదాద్రి తరహాలో వేములవాడ, కొండగట్టు ఆలయాల అభివృద్ధికి KCR ప్రభుత్వం రూ.100 కోట్లతో జీవో జారీ చేసిందని గుర్తుచేశారు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం ఆలయ అభివృద్ధి పనులను నిలిపివేసిందని విమర్శించారు. కొండగట్టు పరిధిలో చేర్చిన భూములపై ప్రొసీడింగ్స్ అమలు కావడం లేదని పేర్కొన్నారు.