News December 30, 2025

MAIDSలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు..

image

న్యూఢిల్లీలోని మౌలానా అజాద్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్(<>MAIDS<<>>)లో 17 కాంట్రాక్ట్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డెంటల్ పీజీతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. నెలకు జీతం రూ.67,700-రూ.2,08,700 చెల్లిస్తారు. స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://maids.delhi.gov.in/

Similar News

News February 20, 2026

33 మంది మైనర్లపై లైంగిక వేధింపులు.. స్పెషల్ కోర్టు సంచలన తీర్పు

image

పోక్సో కేసులో UP స్పెషల్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 2010 నుంచి పదేళ్లపాటు 33 మంది మైనర్లను లైంగికంగా హింసించిన దంపతులు రామ్, దుర్గావతికి మరణశిక్ష విధించింది. ఆ 33 మందికి రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిందితులు చాక్లెట్ల ఆశచూపి మైనర్లను దారుణంగా వేధిస్తూ వీడియోలను చిత్రీకరించి డార్క్‌వెబ్‌లో అమ్మేవారు. పాపం పండటంతో 2020లో వారిని సీబీఐ అరెస్టు చేసింది.

News February 20, 2026

గుజరాత్‌లో పారిపోయిన జంటల వివాహ నమోదు కఠినతరం

image

పారిపోయిన జంటల వివాహ రిజిస్ట్రేషన్ల రూల్స్‌ను కఠినతరం చేయనున్నట్లు గుజరాత్ డిప్యూటీ సీఎం హర్ష్ సంఘవి ప్రకటించారు. ‘లవ్ జిహాద్’ కేసులు పెరుగుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ‘దేశంలో వివాహం ఓ పవిత్ర ఆచారం. మన కుమార్తెలను తప్పుడు పేర్లతో మోసం చేస్తే సంస్కృతిపై ప్రభావం పడుతుంది. అది సమాజ పతనానికి దారితీస్తుంది. వివాహ పవిత్రతను కాపాడటమే మా లక్ష్యం’ అని స్పష్టం చేశారు.

News February 20, 2026

ట్రంప్‌కు BIG SHOCK

image

అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆయా దేశాలపై ట్రంప్ విధించిన టారిఫ్‌లను కొట్టేసింది. సుంకాలు విధించే అధికారం అధ్యక్షుడికి లేదని తేల్చిచెప్పింది. ఇప్పటి వరకు వివిధ దేశాల నుంచి టారిఫ్‌ల రూపంలో వసూలు చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. సుంకాలు విధించేందుకు అత్యవసర అధికారాల వినియోగం చట్టవిరుద్ధమని తెలిపింది. సుప్రీం తీర్పుతో US మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.