News December 30, 2025

కొత్త సంవత్సరం ‘గ్రీటింగ్ స్కామ్స్’.. బీ అలర్ట్!

image

న్యూ ఇయర్ సందర్భంగా ‘గ్రీటింగ్ స్కామ్స్’ పట్ల తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) ప్రజలను అప్రమత్తం చేసింది. వాట్సాప్, టెలిగ్రామ్, SMS ద్వారా వచ్చే పర్సనలైజ్డ్ గ్రీటింగ్స్, న్యూ ఇయర్ గిఫ్ట్స్ లేదా బ్యాంకు రివార్డుల వంటి లింకులను క్లిక్ చేయొద్దని సూచించింది. లేదంటే ‘Malicious APK’ ఫైల్స్ ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయ్యి బ్యాంక్ ఖాతా వివరాలు, OTPలు, వ్యక్తిగత ఫొటోలను దొంగిలించొచ్చని హెచ్చరించింది.

Similar News

News December 31, 2025

రూ.7తో రూ.కోటి.. 10% పేదలకు ఇస్తానన్న రైతు

image

పంజాబ్‌కు చెందిన ఓ రైతును అదృష్టం వరించింది. రూ.7తో లాటరీ టికెట్ కొనగా రూ.కోటి రివార్డు వచ్చింది. ఫతేఘర్‌కు చెందిన రైతు బల్కర్ సింగ్ గత పదేళ్ల నుంచి లాటరీ టికెట్లు కొంటున్నారు. డిసెంబర్ 29న లాటరీ గెలిచినట్లు కాల్ రాగానే డాన్సులతో గ్రామంలో సంబరాలు చేసుకున్నారు. అందరికీ స్వీట్లు పంచారు. వచ్చిన డబ్బుతో తన వ్యవసాయాన్ని ఇంకా పెంచుతానని, 10% పేదలకు పంచుతానని ఆ రైతన్న పేర్కొన్నారు.

News December 31, 2025

iBomma కేసు: నార్మల్ ప్రింట్‌కు $100.. HD ప్రింట్‌కు $200!

image

ఐబొమ్మ రవి కస్టడీ రిపోర్ట్‌ను పోలీసులు కోర్టుకు సమర్పించారు. రిపోర్ట్ ప్రకారం.. రవి రెండు రకాలుగా సినిమా ప్రింట్‌ను కొన్నాడు. నార్మల్ ప్రింట్‌కు $100.. HD ప్రింట్‌కు $200 చెల్లించాడు. తన 7 ఖాతాలకు ₹13.40 కోట్లు వచ్చాయి. బెట్టింగ్, యాడ్‌ల ద్వారా ₹1.78 కోట్లు అందాయి. సోదరి చంద్రికకు రవి ₹90 లక్షలు పంపాడు. రాకేశ్ అనే వ్యక్తి ద్వారా ట్రేడ్ మార్క్ లైసెన్స్ పొందాడు. వచ్చిన డబ్బుతో జల్సాలు చేశాడు.

News December 31, 2025

భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు

image

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో దూసుకెళ్తున్నాయి. ఉదయమే సానుకూలంగా ప్రారంభమైన indices అంతకంతకూ పెరుగుతూ ఇంట్రాడే గరిష్ఠాలను నమోదు చేస్తున్నాయి. సెన్సెక్స్ 429 పాయింట్ల లాభంతో 85,104 వద్ద.. నిఫ్టీ 154 పాయింట్లు పెరిగి 26,092 దగ్గర ట్రేడవుతోంది. టాటా స్టీల్, పవర్ గ్రిడ్, రిలయన్స్, ట్రెంట్, టైటాన్ షేర్లు లాభాల్లో.. TCS, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫీ, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.