News April 24, 2024

శాంసన్‌ను టీమిండియా కెప్టెన్ చేయాలి: హర్భజన్

image

నిన్న ముంబైపై రాజస్థాన్‌ రాయల్స్ సునాయాసంగా గెలుపొందిన సంగతి తెలిసిందే. ఆర్ఆర్ కెప్టెన్ సంజూ శాంసన్, ఓపెనర్ జైస్వాల్‌పై భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ప్రశంసలు కురిపించారు. ‘ఫామ్ తాత్కాలికం, క్లాస్ శాశ్వతం. యశస్వి ఆటే అందుకు నిదర్శనం. టీ20 వరల్డ్‌కప్‌లో కీపర్‌ ఎవరన్నదానిపై ఇక చర్చ అనవసరం. శాంసన్‌నే ఎంపిక చేయాలి. రోహిత్ తర్వాత కెప్టెన్‌గా అతడిని ప్రోత్సహించాలి’ అని అభిప్రాయపడ్డారు.

Similar News

News April 3, 2026

బంగారం, వెండి లేవు.. 10 కేసులున్నాయి: అఫిడవిట్‌లో ఉదయనిధి

image

తనకు ₹20.64 కోట్ల ఆస్తి ఉందని తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ తెలిపారు. అయితే తన వద్ద ఎలాంటి బంగారు, వెండి ఆభరణాలు లేవని ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తన భార్య పేరిట ₹13.25 కోట్ల అసెట్స్ ఉన్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో 10 కేసులు ఉన్నాయని చెప్పారు. చెన్నైలోని చెపాక్-తిరువల్లికేణి డీఎంకే అభ్యర్థిగా ఇవాళ ఆయన నామినేషన్ దాఖలు చేశారు.

News April 3, 2026

స్పెషలిస్ట్ డాక్టర్ల గురించి తెలుసా?

image

*లివర్ (కాలేయం)- హెపటాలజిస్ట్
*మూత్రపిండాలు- నెఫ్రాలజిస్ట్
*క్యాన్సర్- ఆంకాలజిస్ట్
*చెవులు- ఒటోలరింగాలజిస్ట్
*ఊపిరితిత్తులు- పల్మనాలజిస్ట్
*జంతువులు- వెటర్నేరియన్
*కడుపు- గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్

News April 2, 2026

బాబోయ్.. నర్సరీ ఫీజు రూ.3.74 లక్షలు!

image

కార్పొరేట్ స్కూళ్లలో చదువు‘కొనాలంటే’ ఆస్తులు అమ్ముకోవాల్సిందే. ప్రధాన నగరాల్లో ఫీజులు లక్షల్లో ఉండటమే ఇందుకు కారణం. తన కొడుకు నర్సరీ ఫీజు ₹3,74,340 అని గురుగ్రామ్‌(హరియాణా)కు చెందిన ‘ది పీపుల్ స్టూడియో’ ఫౌండర్ పూజా సేతియా తెలిపారు. 3 విడతల్లో ₹1,24,780 చొప్పున చెల్లించాలని చెప్పారని స్క్రీన్‌షాట్ షేర్ చేశారు. ‘పిల్లాడికి ఇంట్లోనే చదువు చెప్పించి, ఆ డబ్బును SIP చేయాలనుకుంటున్నా’ అంటూ రాసుకొచ్చారు.