News December 30, 2025

బాపట్ల ఆశుకవితా మూర్తులు: కొప్పరపు సోదర కవులు

image

సంతమాగులూరు(M) కొప్పరానికి చెందిన కొప్పరపు వేంకట సుబ్బరాయ కవి, వేంకటరమణ కవి తెలుగు సాహిత్య చరిత్రలో ‘కొప్పరపు సోదర కవులు’గా ప్రసిద్ధి చెందారు. ఆశుకవిత్వంలో (అప్పటికప్పుడు పద్యం చెప్పడం) వీరిది తిరుగులేని వేగం. గంటకు 500 నుంచి 700 పద్యాలను ప్రవాహంలా చెప్పగలగడం వీరి ప్రత్యేకత. ఆనాటి ఉద్దండ పండితులైన తిరుపతి వేంకట కవులకు వీరు గట్టి పోటీదారులు. డిసెంబర్ 30 మంగళవారం వేంకటరమణ కవి జయంతి కావడం విశేషం.

Similar News

News January 3, 2026

HYD: బంధాన్ని బలపరిచే ‘2-2-2 రూల్’

image

ప్రస్తుత బిజీ జీవితంలో ప్రేమకు సమయం దొరకడం దంపతులకు కష్టమవుతోంది. వీరికి ‘2-2-2 రూల్’ కొత్త దారి చూపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. ప్రతి 2 వారాలకు ఒక డేట్‌, 2 నెలలకు ఓ వీకెండ్‌ ప్రయాణం, 2 ఏళ్లకు ఒక దీర్ఘ విహారం కలిసి చేయాలనే ఈ సూత్రం అనుబంధాన్ని బలపరుస్తుంది. కలిసి గడిపే సమయం పెరగడంతో భావోద్వేగ అనుబంధం బలపడుతుందని నిపుణులు బోధిస్తున్నారు. చిన్న ప్రణాళికలతో పెద్ద మార్పు సాధ్యమని సూచిస్తున్నారు.

News January 3, 2026

25,487 కానిస్టేబుల్ ఉద్యోగాలు.. కీలక అప్‌డేట్

image

కేంద్ర బలగాల్లో 25,487 కానిస్టేబుల్(<>GD<<>>) పోస్టుల పరీక్షకు సంబంధించి SSC కీలక ప్రకటన చేసింది. ఫిబ్రవరి 23న పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది. త్వరలో సెల్ఫ్ స్లాటింగ్‌ తేదీని వెల్లడించనుంది. అదేవిధంగా 7,948 MTS (నాన్ టెక్నికల్)పోస్టుల భర్తీకి సంబంధించి పరీక్షను ఫిబ్రవరి 4న నిర్వహించనున్నట్లు తెలిపింది. జనవరి 15వరకు సెల్ఫ్ స్లాటింగ్‌కు అవకాశం కల్పించింది. వెబ్‌సైట్: https://ssc.gov.in/

News January 3, 2026

అరటి రైతు ఇంట.. సంక్రాంతి పంట!

image

ఉమ్మడి అనంతపురం జిల్లాలో అరటి ధరలు అమాంతం పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలల క్రితం టన్ను వెయ్యి రూపాయలకు పడిపోయిన ధర, ప్రస్తుతం మొదటి కోత రూ.22 వేలకు చేరింది. ఎగుమతులు పెరగడం, వాతావరణం అనుకూలించడంతో మార్కెట్‌లో డిమాండ్ పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 1000 హెక్టార్లలో అరటి సాగులో ఉంది. సంక్రాంతి పండుగ వేళ ఈ ధరలు రైతుల మోముల్లో నవ్వులు పూయిస్తున్నాయి.