News December 30, 2025

ఏలూరు జిల్లాను మోహరించిన పోలీసులు

image

వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలు భక్తులతో పోటెత్తాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని జిల్లా పోలీసు యంత్రాంగం పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. దర్శనం కోసం వేచి ఉండే భక్తుల మధ్య తోపులాటలు జరగకుండా, క్యూలైన్లను క్రమబద్ధీకరించడంలో పోలీసులు నిమగ్నమయ్యారు. భద్రతను పర్యవేక్షించడానికి తొలిసారిగా అధునాతన డ్రోన్ కెమెరాలను వినియోగిస్తున్నారు.

Similar News

News January 13, 2026

ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్

image

ఇరాన్ ప్రజలు తమ పోరాటాన్ని కొనసాగించాలని ట్రంప్ పిలుపునిచ్చారు. ‘ఇరాన్ దేశభక్తులారా.. ప్రభుత్వ సంస్థలను చేజిక్కించుకోండి. మిమ్మల్ని చంపే వారి, నిందించే వారి పేర్లను సేవ్ చేసుకోండి. వాళ్లు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. నిరసనకారులను చంపడం ఆపేంత వరకు ఇరాన్ ప్రతినిధులతో నా మీటింగ్స్ క్యాన్సిల్ చేసుకున్నా. మీకు అతిత్వరలో సాయం అందబోతోంది. Make Iran Great Again (MIGA)!’ అని ట్రంప్ పోస్ట్ చేశారు.

News January 13, 2026

ఓర్వకల్లుకు ఇప్పటికే రూ.10,000 కోట్ల పెట్టుబడులు: మంత్రి

image

తమ ప్రభుత్వం ప్రజల కోసం సమర్థవంతంగా పని చేస్తూ, రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం దృష్టి పెట్టిందని మంత్రి టీజీ భరత్ తెలిపారు. 46వ వార్డు నరసింహారెడ్డి నగర్‌లో సంక్రాంతి వేడుకల్లో పాల్గొని ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. కర్నూలు, ఓర్వకల్లుకు ఇప్పటికే రూ.10,000 కోట్ల పెట్టుబడులు అందించామని తెలిపారు. అబ్దుల్ కలాం పాఠశాల సమస్యకు పరిష్కారం కోసం కూడా కృషి చేస్తున్నారన్నారు.

News January 13, 2026

తిరుపతి: ఆ విషయంలో సుప్రీంకోర్టు ధ్వజం

image

శునకాల నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని సుప్రీంకోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది. ఇది ఇలా ఉండగా తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో గతేడాది కుక్క కాట్ల ఘటనలు భారీగా నమోదయ్యాయి. 2025 జనవరి నుంచి డిసెంబర్‌ 31 వరకు తిరుపతి జిల్లాలో 20,404 మంది, చిత్తూరు జిల్లాలో 17,159 మంది కుక్క కాటుకు గురయ్యారు. దీంతో మన రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుందో వేచి చూడాలి…?