News December 30, 2025

HYD: మహిళలకు ఉచిత శిక్షణ

image

HYDలో మహిళల ఆర్థిక స్వావలంబనకు దోహదంగా తెలంగాణ మహిళా భద్రతా విభాగం, HYD పోలీసుల సహకారంతో MOWO Social Initiatives భాగస్వామ్యంతో ప్రత్యేక డ్రైవర్ ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నారు. మహిళా ప్రయాణికుల కోసం బైక్ టాక్సీ, e-ఆటో డ్రైవింగ్ రంగాల్లో ఉద్యోగాలు కల్పించనున్నారు. ఉచిత శిక్షణ, లైసెన్స్ సాయం, వాహన లీజ్/ లోన్ సదుపాయం అందించనున్నారు. JAN3న అంబర్‌పేట్ PTCలో ఈ మేళా జరగనుంది.

Similar News

News January 14, 2026

HYD: ప్రముఖ రచయిత్రి ఇందిరాదేవి కన్నుమూత

image

దివంగత మహాకవి గుంటూరు శేషేంద్ర శర్మ భార్య, ప్రముఖ కవయిత్రి, చిత్రకారిణి రాజకుమారి ఇందిరాదేవి ధన్‌రాజ్ గిర్ (96) HYDలోని గోషామహల్‌లో ఉన్న జ్ఞాన్ బాగ్ ప్యాలెస్‌లో తుదిశ్వాస విడిచారు. బహుముఖ ప్రజ్ఞతో సాహిత్య, కళా రంగాల్లో ఆమె తనదైన ముద్ర వేశారు. అల్లా ఇక్బాల్, గాలీబ్, అరబిందో రచనల నుంచి ఇన్‌స్పైర్ అయిన ఇందిరా దేవి చిన్నప్పటి నుంచే రచనలపై ప్రేరణ పొందారు.

News January 14, 2026

పతంగ్‌కు పక్కా ప్లాన్.. చెరువు వద్ల కుర్రాళ్ల చిల్ అవుట్!

image

డాబాల మీద డీజే గోల, పతంగుల కోసం కొట్లాటలకు ఈ తరం కుర్రాళ్లు గుడ్ బై చెప్పేస్తున్నారు. నెక్లెస్ రోడ్, గండిపేట లాంటి చెరువు గట్లనే తమ పతంగ్ అడ్డాగా మార్చుకుంటున్నారు. తెల్లవారుజామునే చాయ్ థర్మోస్‌, ఫోల్డబుల్ కైట్స్, మ్యూజిక్ కోసం చిన్న బ్లూటూత్ స్పీకర్‌తో అక్కడ వాలిపోతున్నారు. రొటీన్ రచ్చకు దూరంగా, ప్రశాంతమైన గాలిలో గాలిపటాలు ఎగరేస్తూ సరికొత్త ‘యాంటీ నాయిస్’ కల్చర్‌కు తెరలేపుతున్నారు. మీకూ నచ్చిందా?

News January 14, 2026

HYD: భూగర్భజలాలు పాతాళానికి

image

భారీ వర్షాలు కురిసినా బల్దియాలోని భూగర్భజలాలు పడిపోతున్నాయి. నిరుడితో పోలిస్తే నీటిమట్టం 2-3 అడుగుల దిగువకు జారిందని అధికార గణాంకాలు చెబుతున్నాయి. GHMC పరిధిలోని 46 మండలాల్లో 13 మండలాలు రెడ్‌జోన్‌లోకి వెళ్లాయి. కాంక్రీటీకరణతో వర్షపు నీరు భూమిలోకి ఇంకకపోవడం ప్రధాన కారణం. బోర్లు అడుగంటడంతో వేసవిలో నగర, శివారువాసులకు నీటి ఎద్దడి తప్పదనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇంకుడు గుంతల ఆవశ్యకత గుర్తుచేస్తున్నాయి.