News April 24, 2024

అనంతపురం: ఎన్నికల మస్కట్‌గా వేరుశనగ

image

అనంతపురం జిల్లా ఎన్నికల మస్కట్‌గా ఆర్ట్స్‌ కాలేజీ విద్యార్థి ప్రశాంత కుమార్‌ రూపొందించిన ‘వేరుశనగ’ ఆకృతి ఎంపిక చేశారు. రాష్ట్రంలోనే మొట్టమొదట ఎన్నికల మస్కట్‌ను రూపొందించిన జిల్లాగా అనంతకు ఖ్యాతి దక్కిందని కలెక్టర్ వినోద్‌కుమార్‌ తెలిపారు. ఎన్నికల మస్కట్‌ ఎంపిక పోటీలకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 62 మస్కట్‌లు రాగా న్యాయ నిర్ణేతలు వేరుశనగ మస్కట్‌ను ఎంపిక చేశారు.

Similar News

News March 6, 2026

నిధులు విడుదల చేయండి: మంత్రి, ఎమ్మెల్యేలు

image

అనంతపురంలోని నడిమి వంక, మరువ వంక ప్రొటెక్షన్ వాల్స్ కోసం రూ.79.46 కోట్ల కేటాయించాలని సీఎం చంద్రబాబుకు MLA దగ్గుపాటి ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. అలాగే మున్సిపాల్టీలో అభివృద్ధి పనుల కోసం పెండింగ్‌లో ఉన్న రూ.18.84 కోట్ల విడుదల చేయాలని కోరారు. శిల్పారామంలో మౌళిక వసతుల కల్పన కోసం రూ.9.95 కోట్లు కేటాయించాలని సీఎంను విజ్ఞప్తి చేశారు. ఇందుకు సీఎం సానుకూలంగా స్పందించారని MLA తెలిపారు.

News March 6, 2026

అనంత విద్యార్థులకు ఇన్‌ఫోసిస్‌లో ఉద్యోగాలు

image

అనంతపురం JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు ప్రాంగణ నియామకాల్లో సత్తా చాటారు. Infosys కంపెనీ నిర్వహించిన ఇంటర్వ్యూల్లో 8మంది ఎంపికయ్యారు. వీరికి రూ.6.25 లక్షల వార్షిక వేతనం లభించినట్లు ప్లేస్‌మెంట్ ఆఫీసర్ చిత్ర తెలిపారు. ఎంపికైన వారిని వీసీ హంచాటే సుదర్శనరావు, ప్రిన్సిపల్ చెన్నారెడ్డి అభినందించారు. విద్యార్థులు తమ నైపుణ్యాలతో మంచి అవకాశాలు దక్కించుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు.

News March 5, 2026

బుక్కరాయసముద్రం: 10 నుంచి ఉచిత శిక్షణ

image

బుక్కరాయ సముద్రం ఆర్డీటీ స్కూల్లో ఈ నెల 10వ తేదీ ఇగ్నైట్ వ్యాపార శిక్షణ నిర్వహిస్తున్నట్లు అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ సీఈవో చంద్రమౌళి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. దివ్యాంగులను వ్యాపారవేత్తలుగా మార్చడానికి ఐదు రోజులు శిక్షణ అందిస్తున్నామన్నారు. 18 నుంచి 45 ఏళ్ల వయసు గల దివ్యాంగులు ఈ శిక్షణకు అర్హులని చెప్పారు. ఉచిత వసతి, భోజనం సదుపాయాలు కల్పిస్తామన్నారు.