News December 30, 2025
2025: నోరు జారి ట్రోల్ అయ్యారు

ఈ ఏడాదిలో పలువురు సెలబ్రిటీలు తమ వ్యాఖ్యలతో ట్రోల్ అయ్యారు. ‘అరి’ సినిమాలో నటించిన శ్రీకాంత్ అయ్యర్ రిలీజ్ సమయంలో చేసిన <<17980424>>వ్యాఖ్యలు<<>> మూవీ కలెక్షన్లపై ప్రభావం చూపాయి. హనుమాన్‌పై కోపం అంటూ దర్శకుడు రాజమౌళి సైతం ట్రోల్ అయ్యారు. రాజాసాబ్ డైరెక్టర్ మారుతి చేసిన వ్యాఖ్యలు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు ఆగ్రహం తెప్పించగా ఆయన <<18374715>>క్షమాపణలు<<>> చెప్పారు. ఇటు శివాజీ <<18688029>>వ్యాఖ్యలు<<>> సృష్టించిన దుమారం ఇంకా చల్లారలేదు.
Similar News
News January 4, 2026
ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ ఇండియాలో పోస్టులు

ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (<
News January 4, 2026
‘జెలెన్‌స్కీని పుతిన్ బంధిస్తే?’.. ట్రంప్‌పై రో ఖన్నా ఫైర్!

వెనిజులా అధ్యక్షుడు మదురో అరెస్ట్‌ను భారత సంతతి US MP రో ఖన్నా తప్పుబట్టారు. ఇది ఒక అనవసర యుద్ధమని విమర్శించారు. ‘ఇలాంటి దాడుల వల్ల ప్రపంచానికి తప్పుడు సంకేతాలు వెళ్తాయి. రేపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని పుతిన్ బంధిస్తే? లేదా తైవాన్ నేతలపై చైనా దాడి చేస్తే అప్పుడు మనం ఏమనగలం?’ అని ప్రశ్నించారు. ఈ చర్య వల్ల అంతర్జాతీయ వేదికపై అమెరికా నైతిక బలాన్ని కోల్పోతుందని రో ఖన్నా అభిప్రాయపడ్డారు.
News January 4, 2026
మదురోను బంధించిన డెల్టా ఫోర్స్.. అసలు ఎవరీ కిల్లర్ టీమ్?

US సైన్యంలో అత్యంత రహస్యమైన, పవర్‌ఫుల్ విభాగం డెల్టా ఫోర్స్. 1977లో బ్రిటీష్ SAS స్ఫూర్తితో దీన్ని స్థాపించారు. ఇందులో చేరడం చాలా కష్టం. వీరు యూనిఫామ్ ధరించకుండా సాధారణ పౌరుల్లా ఉంటూ రహస్య ఆపరేషన్లు చేస్తారు. సద్దాం హుస్సేన్ పట్టివేత, అల్ బగ్దాదీ హతం తాజాగా మదురో అరెస్ట్ వంటి మిషన్లు వీరే చేశారు. అత్యాధునిక ఆయుధాలు, నైట్ విజన్ టెక్నాలజీతో శత్రువులకు చిక్కకుండా మెరుపు దాడి చేయడం వీరి స్పెషాలిటీ.


