News April 24, 2024

NLG: సైదిరెడ్డి ఆస్తులు.. అప్పులు ఇవే..!

image

NLG బీజేపీ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి తన కుటుంబ ఆస్తులు రూ.31,33,55,479గా ఎన్నికల నామినేషన్ అఫిడవిట్లో చూపించారు. అదేవిధంగా రూ.6,10,9131 అప్పులు.. తన చేతిలో రూ.45వేల నగదు ఉన్నట్లు చెప్పారు. HYD బంజారాహిల్స్ DCCBలో రూ.7,97,650, యూనియన్ బ్యాంకులో రూ.3,60,940, SBIలో రూ.18,17,072, ICICIలో రూ.10లక్షల డిపాజిట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే కెనడాలో రెండు ఇళ్లు ఉన్నాయని తెలిపారు.

Similar News

News April 1, 2026

NLG: ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు.. నిర్మాణంలో జాప్యం

image

జిల్లాలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణ పనులు జాప్యంతో సాగుతున్నాయి. గంధంవారిగూడెంలో ఒక బ్లాక్ మినహా మిగిలినవి ప్రాథమిక దశలోనే ఉన్నాయి. మునుగోడు, గడ్డిపల్లి, చిలుకూరు, తుర్కపల్లిలో నిర్మాణాలు ఆరంభంలోనే ఉండగా, నకిరేకల్‌లో స్థలసేకరణ మాత్రమే పూర్తయింది. సాగర్, DVK, MLGలో అసంపూర్తిగా ఉన్నాయి. వచ్చే విద్యాసంవత్సరానికి స్కూళ్లు సిద్ధం కావడం కష్టంగానే ఉంది.

News April 1, 2026

నల్గొండ: రేపు గ్రామ, వార్డు సభలు.. ప్రభుత్వ సూచనలు

image

1) ఉ.10గంటలకు రాష్ట్ర గీతం ‘జయజయహే తెలంగాణ’ ఆలపించి, సభను ప్రారంభించాలి.
2) గ్రామసభలో సర్పంచ్‌తోపాటు పాలకవర్గం, వార్డు సభలో మున్సిపల్ ఛైర్మన్‌తోపాటు పాలకవర్గం, అధికారులు, ప్రజలు హాజరుకావాలి.
3) CMసందేశాన్ని చదివి వినిపించాలి.
4) ప్రభుత్వ విజయాలు, 6గ్యారంటీలపై అవగాహన కల్పించి, పథకాలకు అర్హులను గుర్తించాలి.
5) ప్రజాసమస్యల కోసం ఫిర్యాదుల బాక్సులను ఏర్పాటు చేయాలి.. పరిష్కారాలపై కార్యాచరణ రూపొందించాలి.

News April 1, 2026

NLG: 3 నెలలు పూర్తి.. అందని గౌరవ వేతనం

image

సర్పంచులు బాధ్యతలు స్వీకరించి వంద రోజులు పూర్తయినా ఇప్పటివరకు గౌరవ వేతనం అందలేదు. జిల్లాలోని 865 జీపీల్లో సర్పంచులకు నెలకు రూ. 5,000 చొప్పున గౌరవ వేతనం ఇవ్వాల్సి ఉంది. ఆర్భాటంగా పదవులు చేపట్టిన ప్రజాప్రతినిధులకు క్షేత్రస్థాయిలో సమస్యలు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి బకాయిలు విడుదల చేయాలని వారు కోరుతున్నారు.