News December 30, 2025
భువనగిరి జిల్లా తొలి ఎస్పీగా అక్షాంశ్ యాదవ్

యాదాద్రి భువనగిరి జిల్లా తొలి ఎస్పీగా అక్షాంశ్ యాదవ్ నియమితులయ్యారు. ఫ్యూచర్ సిటీ, హైదరాబాద్ పరిధిలోని కమిషనరేట్ల పునర్ వ్యవస్థీకరణలో భాగంగా రాచకొండ పరిధిలోని భువనగిరి జోన్‌ను ప్రత్యేక పోలీస్ జిల్లాగా గుర్తిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఇక్కడ డీసీపీగా విధులు నిర్వహిస్తున్న అక్షాంశ్ యాదవ్‌నే ప్రభుత్వం జిల్లా ఎస్పీగా నియమించింది.
Similar News
News January 12, 2026
శ్రీకాకుళం: నాలుగు సార్లు MLA.. రెండు సార్లు మంత్రి!

జిల్లాలో ప్రభావవంతమైన రాజకీయ నాయకులలో ఒకరిగా గుర్తింపు పొందిన గుండ అప్పల సూర్యనారాయణ తన రాజకీయ ప్రస్థానంలో ప్రత్యేకమైన ముద్ర వేశారు. 1985లో TDP నుంచి శ్రీకాకుళం నియోజకవర్గం ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచారు. అప్పటి నుంచి 2004 వరకూ వరుసగా 4 సార్లు శ్రీకాకుళం MLAగా గెలుపొందుతూ వచ్చారు. 1987లో కరువు శాఖ మంత్రిగా, 1989లో బీసీ, ఎస్సీ, సాంఘిక సంక్షేమ, మహిళా & శిశు సంక్షేమ శాఖ మంత్రిగా సేవలందించారు.
News January 12, 2026
మద్యం బాటిల్‌పై రూ.10 పెంపు

AP: మద్యం ధరలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రూ.99 MRP ఉన్న మద్యం బాటిళ్లు, బీర్లు, వైన్ బాటిళ్లు మినహా మిగతావాటికి రూ.10 చొప్పున పెంచింది. దీంతో ఏటా రూ.1,391 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. బార్లు, మద్యం షాపుల్లో వేర్వేరు ధరలు ఉండటంతో అదనపు రిటైల్ ఎక్సైజ్ పన్నును ఉపసంహరించాలని నిర్ణయించింది. దీంతో బార్లు, మద్యం షాపుల్లో ధరలు ఒకేలా ఉండే అవకాశం ఉంది.
News January 12, 2026
నెల్లూరు: మన నిమ్మకు.. ఉత్తరాదిన ధీమా.!

నెల్లూరు జిల్లా నుంచి దేశంలో పలు ప్రాంతాలకు అత్యధికంగా నిమ్మ పంట ఎగుమతి అవుతుంది. ఢిల్లీ, బిహార్, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్, UPలకు సీజన్‌లో ఎక్కువగా, అన్ సీజన్ TN, కర్ణాటక, కేరళకు వెళ్తున్నాయి. 23-24లో 50628 క్వింటాళ్లు (రూ.14.99 cr), 24-25లో 36579 క్వింటాళ్లు (రూ.14.73cr), 25-26లో 21631 క్వింటాళ్లు (రూ.6.16cr) విక్రయాలు జరిగాయి. ప్రస్తుత కలెక్టర్ చొరవతో నిమ్మ KG రూ.22 ఉందని రైతులన్నారు.


