News December 30, 2025
కదిరిలో శ్రీవారిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్

కదిరిలోని శ్రీ ఖాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ స్వామివారిని దర్శించుకున్నారు. ఉత్తర ద్వారం ద్వారా స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించిన అనంతరం, భక్తుల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలను స్వయంగా పరిశీలించారు. ఆర్డీవో శర్మ, ఈఓ శ్రీనివాస్ రెడ్డి కలెక్టర్‌కు ఘనస్వాగతం పలికారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు.
Similar News
News February 9, 2026
నాలుగు రోజులు సెలవులు!

TG: ఈ వారంలో పలు జిల్లాల్లో స్కూళ్లకు నాలుగు రోజులు హాలిడేస్ ఉండే అవకాశముంది. ఎల్లుండి(11) పోలింగ్ జరిగే ప్రాంతాల్లో సెలవులు ప్రకటించాలని ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేశారు. లెక్కింపు రోజైన 13న కూడా ఆయా స్కూళ్లు, కార్యాలయాలకు హాలిడేస్ ఉండనున్నాయి. మరుసటి రోజు రెండో శనివారం కాగా తదుపరి ఆదివారం కావడంతో వరుస సెలవులు రానున్నాయి. మరోవైపు ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో వైన్ షాపులు <<19086702>>బంద్<<>> ఉండనున్నాయి.
News February 9, 2026
అమరావతిలో ఏఐ యూనివర్సిటీ!

AP: అమరావతిలో ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు కాబోతోంది. ఏఐ ఎకో సిస్టమ్, మౌలిక సదుపాయాల కల్పన, శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు వీలుగా రాష్ట్ర ఐటీ శాఖ జీవో జారీ చేసింది. ఏఐ లివింగ్ ల్యాబ్స్ పేరుతో వర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వంతో ఎన్‌విడియా కంపెనీ గతంలో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ క్రమంలో ఈ నెల 19 నుంచే వర్సిటీ కార్యకలాపాలు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే దేశంలోనే తొలి ఏఐ వర్సిటీగా నిలవనుంది.
News February 9, 2026
దీపారాధనలో ఎన్ని వత్తులు పెట్టాలి?

దీపారాధనలో వత్తుల సంఖ్యకు శాస్త్రపరంగా ప్రాముఖ్యత ఉంది. నిత్య దీపారాధనలో ఏకవత్తి పెట్టకూడదు. ఒకే వత్తిని అశుభ సమయాల్లో మాత్రమే వాడతారు. సామాన్యంగా ఇంట్లో దీపం వెలిగించేటప్పుడు కనీసం 2 వత్తులు కలిపి వేయడం శుభప్రదం. దీనిని ‘దంపతి వత్తి’ అని కూడా అంటారు. రెండుకు మించి ఇంకా ఎన్ని వత్తులైనా పెట్టవచ్చు. అందుకు ఎలాంటి నియమాలు లేవు. 108 వత్తుల దీపం వెలిగిస్తే దారిద్ర్య బాధలు తొలగిపోతాయని నమ్మకం.


