News December 30, 2025

జనవరి 1నుంచి పోలీస్ యాక్ట్ అమలు: సంగారెడ్డి ఎస్పీ

image

సంగారెడ్డి జిల్లాలో జనవరి 1 నుంచి 31వ తేదీ వరకు పోలీస్ 30, 30(ఎ) అమలులో ఉంటుందని ఎస్పీ పరితోష్ మంగళవారం తెలిపారు. పోలీసుల అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించవద్దని చెప్పారు. పోలీసుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Similar News

News February 19, 2026

అమరావతిలో దసపల్లా హోటల్ పనులు షురూ

image

అమరావతిలో దసపల్లా 4-స్టార్ హోటల్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఇందులో లగ్జరీ గదులు, సూట్స్, ప్రీమియం సర్వీస్ అపార్ట్‌మెంట్లు అందుబాటులో ఉంటాయి. రెస్టారెంట్లు, కన్వెన్షన్ సెంటర్, కాన్ఫరెన్స్ హాల్‌ను ఏర్పాటు చేస్తున్నారు. స్విమ్మింగ్ పూల్, వెల్‌నెస్ సెంటర్, హెల్త్ క్లబ్ వంటి అత్యాధునిక సౌకర్యాలతో ఈ హోటల్ రూపుదిద్దుకుంటోంది. రాజధానిలో ఆతిథ్య రంగానికి ఇది మరింత ఊతమివ్వనుంది.

News February 19, 2026

మిధాని ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ ట్రస్ట్‌లో ఉద్యోగాలు

image

హైదరాబాద్‌లోని <>మిధాని<<>> ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ ట్రస్ట్‌ 6 పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టును బట్టి MBBS, BSc(నర్సింగ్, MLT), GNM, బీఫార్మసీ, డీఫార్మసీ, DMLT, BCom, BCA అర్హతతో పాటు పని అనుభవం గలవారు మార్చి 5, 6, 7, 9, 10, 11 తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ/ ట్రేడ్/ప్రొఫిషియన్సీ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://midhani-india.in

News February 19, 2026

మహిళల్లో మైగ్రేన్‌కి ఎన్నో కారణాలు

image

మైగ్రెయిన్ తలలో ఒకవైపు మాత్రమే వేధించే ఒక రకమైన తలనొప్పి. అయితే మహిళల్లో నెలసరికి ముందు, నెలసరి రోజుల్లో మైగ్రేన్ బాధలు అధికంగా ఉంటాయంటున్నారు నిపుణులు. మానసిక ఒత్తిడి, అధిక శ్రమ, ప్రకాశవంతమైన వెలుతురు, నెలసరిలో తేడాలు, గర్భ నిరోధక మాత్రలు, మత్తుపానీయాలు, ధూమపానం అలవాట్లు ఇవన్నీ మైగ్రెయిన్​ను ప్రేరేపిస్తాయంటున్నారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, తగినంత నిద్ర ఉండాలని సూచిస్తున్నారు.