News April 24, 2024
విజయనగరం: చెల్లూరులో సీఎం జగన్ సభ

సీఎం జగన్ ఈరోజు ఉ.9 గంటలకు ఎంవీవీ సిటీ నుంచి బయలుదేరతారు. విశాఖలోని మధురవాడ మీదుగా ఆనందపురం చేరుకుని కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం తగరపువలస మీదుగా జొన్నాడ చేరుకుని విశ్రాంతి తీసుకుంటారు. ఆ తర్వాత బొద్దవలస మీదుగా సా. 3.30 గంటలకు చెల్లూరు చేరుకుని బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం చింతలవలస, భోగాపురం, రణస్థలం మీదుగా అక్కివలసలో రాత్రి బస శిబిరానికి చేరుకుంటారని వైసీపీ నాయకులు తెలిపారు.
Similar News
News March 3, 2026
VZM: ఇంట్లోవారిని బెదిరిద్దామని గడ్డిమందు తాగిన వ్యక్తి..

విజయనగరం (D) రేగిడి మండలం బూరాడకి చెందిన జగ్గునాయుడు కొంత కాలంగా మద్యానికి బానిస అయ్యాడు. మద్యం తాగవద్దని కుటుంబ సభ్యులు చెప్పడంతో వారిని బెదిరించేందుకు ఆదివారం సాయంత్రం తాగిన మైకంలో ఇంటి సమీపంలో గడ్డి మందు తాగాడు. అపస్మారక స్థితిలో ఉన్న జగ్గునాయుడిని కుటుంబీకులు రాజాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించటంతో శ్రీకాకుళం రిమ్స్‌కి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు.
News March 3, 2026
మార్చి 4న కొత్తవలసలో ఒడిశా గవర్నర్ పర్యటన

ఒడిశా రాష్ట్ర గవర్నర్ కంభంపాటి హరిబాబు మార్చి 4వ తేదీన కొత్తవలస మండలంలో పర్యటించనున్నారు. మండలంలోని శ్రీ గురుదేవ ఛారిటబుల్ ట్రస్ట్, హాస్పిటల్‌ను ఆయన సందర్శించనున్నారు. ఈ మేరకు గవర్నర్ పర్యటనకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించాలని వివిధ శాఖల అధికారులను కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు.
News March 2, 2026
సంగాం: రేపు సంగమేశ్వర స్వామి ఆలయం మూసివేత

జిల్లాలోని ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం సంగాం సంగమేశ్వర స్వామి ఆలయాన్ని సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా రేపు మూసివేయనున్నట్లు ఆలయ ఈవో శ్యామలరావు తెలిపారు. మంగళవారం ఉదయం 6 గంటలకు తలుపులను మూసివేస్తామని బుధవారం సంప్రోక్షణ అనంతరం ఉదయం 8 గంటల నుంచి భక్తులను దర్శనాలకు అనుమతిస్తామని ఆలయ చైర్మన్ బోను ఆనందరావు తెలిపారు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని ఆలయ ప్రధాన అర్చకులు సిద్ధాంతం గణపతి రావు కోరారు.


