News December 30, 2025
సిద్దిపేట ఐటీ టవర్‌లో టెక్నికల్ కోర్సులకు కోచింగ్

సిద్దిపేట జిల్లా ఐటీ టవర్‌లోని టాస్క్ సెంటర్‌లో టెక్నికల్ కోర్సులకు శిక్షణ ఇస్తున్నట్లు టాస్క్ మేనేజర్ నరేందర్ గౌడ్ తెలిపారు. C and DSA, java, python, html & css, java script, cloud computing, sql, Aptitude and reasoning, tally, basic IT skillsపై ట్రైనింగ్ ఉంటుందన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు జనవరి 10వ తేదీలోపు సిద్దిపేట ఐటీ టవర్ టాస్క్ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. డిగ్రీ అర్హత ఉండాలన్నారు.
Similar News
News January 1, 2026
భద్రాద్రి: బొకేలు వద్దు.. నోటు పుస్తకాలే ముద్దు: కలెక్టర్

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా తనకు శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చే వారు బొకేలు, శాలువాలు తీసుకురావొద్దని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ విజ్ఞప్తి చేశారు. జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఆయన, ఈ ఏడాది అందరి జీవితాల్లో సుఖశాంతులు నిండాలని ఆకాంక్షించారు. వృథా ఖర్చులకు బదులుగా పేద విద్యార్థులకు ఉపయోగపడే నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు వంటి విద్యా సామగ్రిని అందజేయాలని కోరారు.
News January 1, 2026
అసభ్యంగా తాకేందుకు ప్రయత్నిస్తే బూటుతో కొట్టా: బ్రిటన్ రాణి

టీనేజీలో తనకు ఎదురైన అనుభవాన్ని బ్రిటన్ రాణి కెమిల్లా తాజాగా పంచుకున్నారు. ‘16-17 ఏళ్ల వయసులో నేను లండన్‌లో రైలులో వెళ్తుండగా ఓ వ్యక్తి అసభ్యంగా తాకేందుకు ప్రయత్నించాడు. అతడిని అడ్డుకోవడంతో నాపై దాడి చేశాడు. నేను బూటు తీసి కొట్టాను. మహిళలపై జరుగుతున్న హింస ఎంత పెద్ద సమస్యో తెలియజేసేందుకే ఇప్పుడు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నా’ అని ఓ రేడియో ఇంటర్వ్యూలో కెమిల్లా తెలిపారు.
News January 1, 2026
సింగర్ మంగ్లీ ఈవెంట్‌లో విషాదం?

AP: సింగర్ మంగ్లీ ఈవెంట్‌లో విషాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. అనంతపురంలో శుభారంభ్ పేరుతో నిర్వహిస్తున్న న్యూఇయర్ వేడుకల్లో ఓ యువకుడు చనిపోయాడని సమాచారం. వేణుగోపాల్ నగర్‌కు చెందిన షౌకత్ కరెంట్ షాక్‌తో మృతి చెందాడని తెలిసింది. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వేడుకల సమయంలో జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.


