News December 30, 2025
ఇష్టారాజ్యంగా ఛార్జీల వసూళ్లు.. కలెక్టర్ సీరియస్

మహాశివరాత్రి జాతర సందర్భంగా వేములవాడకు వచ్చే భక్తుల వద్ద అద్దె గదుల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా ఛార్జీలు వసూలు చేయకుండా చూడాలని జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ గరీమా అగర్వాల్ ఆదేశించారు. జాతర సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. భక్తుల రద్దీని ఆసరాగా చేసుకుని అదనంగా వసూలు చేయకుండా రెవెన్యూ, పోలీసు యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకోసం ఒక కమిటీ వేస్తామని RDO రాధాబాయి ఈ సందర్భంగా అన్నారు.
Similar News
News January 20, 2026
అన్నమయ్య: ఘోర ప్రమాదం.. ఇద్దరి మృతి

అన్నమయ్య జిల్లాలో మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వాయల్పాడు సమీపంలోని చింతరాపల్లి వద్ద ఇద్దరు బైకుపై బయల్దేరారు. ఈక్రమంలో తిరుపతి నుంచి మదనపల్లె వైపు వెళ్తున్న కారు కిందకు బైక్ దూసుకెళ్లింది. స్పాట్‌లోనే ఇద్దరు చనిపోయారు. మృతులు ఎవరనేది తెలియాల్సి ఉంది.
News January 20, 2026
రామచంద్రమూర్తికి జీవన సాఫల్య పురస్కారం: YVU వీసీ

ప్రముఖ జర్నలిస్టు, సంపాదకులు కె.రామచంద్రమూర్తికి గజ్జెల మల్లారెడ్డి జీవన సాఫల్య పురస్కారం-2025 ఇవ్వనున్నట్లు యోగి వేమన విశ్వవిద్యాలయ వి.సి ప్రొ.బెల్లంకొండ రాజశేఖర్ తెలిపారు. పత్రికా రంగంలో విశిష్ట సేవలు అందించిన జర్నలిస్టులకు ప్రతి ఏటా ఒకరికి అవార్డును అందజేస్తున్నారు. 2025కు ఈయన్ను ఎంపిక చేశామన్నారు.
News January 20, 2026
మన్యం కొండ బ్రహ్మోత్సవాలకు పటిష్ఠ ఏర్పాట్లు

మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను ఈ నెల 28 నుంచి మార్చి 5 వరకు నిర్వహించనున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. మంగళవారం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. లక్షలాది భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున రథోత్సవం శని, ఆదివారాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు.


