News December 30, 2025
KNR: దివ్యాంగుల జంటలకూ రూ.లక్ష వివాహ ప్రోత్సాహకం

దివ్యాంగులను సకలాంగులు వివాహం చేసుకుంటే ఇచ్చే రూ.లక్ష ప్రోత్సాహకాన్ని ఇకపై ఇద్దరు దివ్యాంగులు వివాహం చేసుకున్నా అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మే 19, 2025 తర్వాత వివాహం చేసుకున్నవారు www.epass.telangana.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం దరఖాస్తులను స్థానిక ఐసీడీఎస్(ICDS) కార్యాలయంలో సమర్పించాలని కరీంనగర్ జిల్లా సంక్షేమ అధికారి పేర్కొన్నారు.
Similar News
News January 17, 2026
ప.గో: బాలికపై అత్యాచారం చేసిన వృద్ధుడు

బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వృద్ధుడిని భీమవరం టూటౌన్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఎస్సై రెహమాన్ తెలిపిన వివరాల ప్రకారం.. కుమ్మరి వీధికి చెందిన కోణాల సరస్వతి (84) స్థానిక బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు.
News January 17, 2026
డ్రాగన్ ఫ్రూట్‌తో మహిళలకు ఎన్నో లాభాలు

కలర్‌ఫుల్‌గా కనిపించే డ్రాగన్ ఫ్రూట్‌లో అనేక పోషకాలుంటాయి. ఇవి మహిళల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయంటున్నారు నిపుణులు. మహిళల్లో ఐరన్, ఫోలేట్, విటమిన్ సి లోపాన్ని భర్తీ చేస్తుంది. ముఖ్యంగా మెనోపాజ్ సమయంలో ఆస్టియో పోరోసిస్ ప్రమాదం ఎక్కువ. డ్రాగన్ ఫ్రూట్‌ను రెగ్యులర్‌గా తీసుకుంటే మెగ్నీషియం, క్యాల్షియం అంది ఎముకలు బలంగా తయారవుతాయి. అలాగే శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తి పెంచుతుందని చెబుతున్నారు.
News January 17, 2026
నవ గ్రహాలు వాటి ప్రత్యధి దేవతలు

ఆదిత్యుడు – రుద్రుడు
చంద్రుడు – గౌరి
అంగారకుడు – క్షేత్రపాలకుడు
బుధుడు – నారాయణుడు
గురు – ఇంద్రుడు
శుక్రుడు – ఇంద్రుడు
శని – ప్రజాపతి
రాహువు – పాము
కేతువు – బ్రహ్మ


