News December 30, 2025
భూపాలపల్లి: జాగ్రత్త.. పులి మళ్లీ వచ్చే అవకాశం!

జిల్లాలోని గోరికొత్తపల్లి మండలం కోనరావుపేట మీదుగా పులి సంచరించినట్లు అధికారులు పేర్కొన్నారు. కొనరావుపేట మీదుగా ములుగు జిల్లా అబ్బాపురం, జాకారం, పందికుంట, మల్లంపల్లి ద్వారా పాకాల అటవీ ప్రాంతానికి పెద్దపులి వెళ్లినట్టు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. మళ్లీ తిరిగే వచ్చే అవకాశం ఉందని, ప్రజలు అడవికి పోవద్దని ములుగు, భూపాలపల్లి జిల్లా అటవీ శాఖ అధికారులు తెలిపారు.
Similar News
News January 1, 2026
ముఖాన్ని మెరిపించే బ్యూటీ టిప్స్

* కలువ పూరేకలు, తేనె, పాలు కలిపి పేస్ట్ చేసి ముఖానికి రాసి అరగంట తర్వాత కడిగేసుకుంటే ముడతలు, మచ్చలూ తగ్గుతాయి. * గులాబీ రేకల ముద్దకు కాసిన్ని పాలు, చెంచా సెనగపిండి కలిపి ముఖానికి, మెడకు రాయండి. పావుగంట ఆరనిచ్చి కడిగితే ముఖం మెరిసిపోతుంది. * మల్లెలను పేస్టు చేసి, అందులో కొబ్బరినూనె కలపాలి. దీన్ని ముఖానికి రాసి పావుగంట సేపు మృదువుగా మర్దనా చేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే చాలు.
News January 1, 2026
మెదక్: ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి: కలెక్టర్

ప్రజలందరూ ఆనందంగా సుఖసంతోషాలతో పాడిపంటలతో ఉండాలని కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. నూతన సంవత్సరం పురస్కరించుకొని మెదక్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కుటుంబ సమేతంగా దర్శించుకుని పూజలు నిర్వహించారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలిగి ఉండాలని భగవంతుని ప్రార్థించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
News January 1, 2026
మెదక్: ట్రాఫిక్ రూల్స్ పాటించాలి: అదనపు కలెక్టర్

రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా రోడ్డు భద్రత మాస ఉత్సవాలు నిర్వహిస్తున్నామని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ పేర్కొన్నారు. మెదక్ ఆర్టీసీ డిపోలో రోడ్డు భద్రత మహాసభల కార్యక్రమం నిర్వహించారు. వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ కచ్చితంగా పాటించాలని సూచించారు. డిపో మేనేజర్ సురేఖ, పోలీస్ అధికారులు, రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు.


