News December 30, 2025
రామచంద్రపురం: సంక్రాంతికి ప్రత్యేక ఆర్టీసీ బస్సులు

సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక బస్సులను నడపనుంది. హైదరాబాద్‌లోని బీహెచ్‌ఈఎల్, మియాపూర్ ప్రాంతాల నుంచి ఏపీకి వెళ్లేవారి కోసం హెచ్‌ఈఎల్ డిపో నుంచి ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ఈ బస్సులు జనవరి 9 నుంచి 13వ తేదీ వరకు నడుస్తాయి. ఆర్సీపురం నుంచి బయలుదేరే ఈ బస్సులు బయలుదేరనున్నట్లు డిపో మేనేజర్ తెలిపారు.
Similar News
News January 15, 2026
కొత్తకొండ జాతరకు కొత్తపల్లి ఎడ్ల రథాలు!

భీమదేవరపల్లి మండలంలోని కొత్తపల్లి గ్రామం నుంచి గత 60 ఏళ్లుగా కొత్తకొండ జాతరకు రథాలు బయల్దేరడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ప్రతి ఏడాది సుమారు 80 ఎడ్ల బండ్లతో రథయాత్ర సాగుతుంది. కొత్తపల్లి నుంచి కొత్తకొండ వీరభద్ర స్వామి ఆలయానికి చేరుకుని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడంతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోతాయి. ఈ సంప్రదాయం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
News January 15, 2026
లింకులను క్లిక్ చేస్తే బుక్ అయినట్లే: ఎమ్మిగనూరు సీఐ

వాట్సాప్ గ్రూపులలో ‘నాకు రూ.5 వేలు వచ్చాయి. నేను నకిలీ అనుకున్నాను. మీరూ ప్రయత్నించి చూడండి. మీరు పది మందికి ఈ లింకును ఫార్వర్డ్ చేయండి’ అని వచ్చే లింకులను క్లిక్ చేయవద్దని ఎమ్మిగనూరు CI శ్రీనివాసులు పేర్కొన్నారు. సైబర్ నేరగాళ్లు ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్నారన్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, తదితర మాధ్యమాల నుంచి వచ్చే లింకులు ఓపెన్ చేయొద్దన్నారు.
News January 15, 2026
NTVపై చర్యలకు కారణం ఇదేనా?

TG: మంత్రి, ఓ మహిళా IAS అధికారికి సంబంధం ఉందని <<18856335>>NTV<<>>, పలు యూట్యూబ్ ఛానళ్లలో వచ్చిన వార్తతో సివిల్ సర్వీస్ అధికారుల సంఘం తీవ్రంగా స్పందించింది. నేరుగా పేరు ప్రస్తావించకపోయినా హోదాలు చెప్పి పరోక్షంగా ఆమె పరువుకు భంగం కలిగించారని ఫిర్యాదు చేసింది. ఆ వార్తను ఏ మాత్రం సహించబోమని స్పష్టం చేయడంతో సర్కారు.. సిట్ ఏర్పాటు చేసి యూట్యూబ్ ఛానళ్లకు నోటీసులు ఇచ్చింది. NTV రిపోర్టర్లను అరెస్టు చేసింది.


