News December 30, 2025
KNR: ‘మహా శివరాత్రి జాతరకు పటిష్ఠ బందోబస్తు’

ఫిబ్రవరి 14, 15, 16వ తేదీలో వేములవాడలో జరుగనున్న మహా శివరాత్రి జాతరకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేస్తామని ఎస్పీ మహేశ్ బి.గితే తెలిపారు. జాతర సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతర సందర్భంగా 8 మంది డీఎస్పీలు, 38 మంది సీఐలు, 119 మంది ఎస్సైలు, 158 ఏఎస్సైలు, 388 కానిస్టేబుళ్లు, హోమ్ గార్డ్స్‌తో కలిపి మొత్తం 1300 మందికి పైగా పోలీసులు మూడు రోజులు బందోబస్తు నిర్వహిస్తారని వెల్లడించారు.
Similar News
News January 1, 2026
పండగ వేళ ప్రయాణికులకు RTC గుడ్ న్యూస్

TG: సంక్రాంతి పండగ వేళ టీజీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. అప్ అండ్ డౌన్(రానూపోనూ) టికెట్ బుక్ చేసుకుంటే ఛార్జీల్లో 10శాతం రాయితీ ప్రకటించింది. ఇప్పటికే పలు మార్గాల్లో టికెట్ ధరలు, ఈవీ బస్సు ప్రయాణాల్లో రాయితీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఆర్టీసీ <
News January 1, 2026
మామిడి పూత విడిగినప్పుడు మందుల పిచికారీ వద్దు

మామిడి చెట్లలో పూత పూర్తిగా విడిగిన దశలో తేనెటీగలు ఎక్కువగా తిరుగుతూ ఫలదీకరణకు సహాయపడతాయి. అందుకే ఈ దశలో చెట్లకు ఎలాంటి మందులు స్ప్రే చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ మందులను పిచికారీ చేస్తే పిందె ఏర్పడడానికి అవసరమయ్యే పుప్పొడి కొట్టుకుపోతుంది. అలాగే పిందె ఏర్పడటానికి సాయం చేసే తేనేటీగలు కూడా రసాయనాల వల్ల చనిపోతాయి. ఫలితంగా ఫలదీకరణ సరిగా జరగక పిందె సరిగా కట్టదు.
News January 1, 2026
MBNR:News Year..స్టాల్స్ ఏర్పాటుకు ఆహ్వానం

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని మహబూబ్ నగర్ లోని స్థానిక మయూరి ఎకో పార్క్‌కు అధిక సంఖ్యలో సందర్శకులు వచ్చే అవకాశం ఉన్నందున పార్క్ లో రుసుముతో కూడిన వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేయాలనుకున్న వారు స్థానిక పార్క్ లో సంప్రదించాలని జిల్లా అటవీ శాఖ అధికారి సత్యనారాయణ తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


