News December 30, 2025
ములుగు అడవుల్లో జంట పులుల సంచారం..!

ములుగు అడవిలోకి సోమవారం పెద్దపులి సంచారం కలకలం రేపగా మంగళవారం మరో పులి పాద ముద్రలు ఆందోళన కలిగిస్తున్నాయి. ములుగు మండలం అబ్బాపురం వద్ద పంట పొలాల్లో పులి అడుగులను అటవీ అధికారులు గుర్తించారు. ఆడ పులి అడుగులుగా నిర్ధారించారు. నిన్న వచ్చిన మగ పులి సర్వాపూర్ నుంచి పాకాల వైపునకు వెళ్తుండగా దానిని ఆడ పులి అనుసరిస్తున్నట్లు భావిస్తున్నారు. ఈ రెండు పంట పొలాల మీదుగా వెళ్తుండటం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది.
Similar News
News January 11, 2026
వరంగల్‌లో ఇండోర్ స్టేడియంకు నిధులివ్వండి: రాఘవరెడ్డి

వరంగల్ జిల్లాలో ఇండోర్ స్టేడియంకు రూ.1.50 కోట్ల నిధులు మంజూరు చేయాలని మంత్రి వాకిటి శ్రీహరిని రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి కోరారు. రాష్ట్రంలో ఉద్యోగాలలో స్పోర్ట్స్‌కు రిజర్వేషన్లను తీసుకురావాలన్నారు. స్టేడియంకు ఎస్టిమేట్స్ తీసుకువస్తే నిధులు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
News January 11, 2026
మహానందిలో గిరిజన పాఠశాల విద్యార్థి మృతి

మహానందిలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థి విజయ్ కుమార్ తలకు కడ్డీలు గుచ్చుకొని తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విజయ్ కుమార్(13) కోలుకోలేక ఆదివారం మృతి చెందినట్లు మహానంది పోలీసులు తెలిపారు. గోస్పాడు మండలం సాంబవరం గ్రామానికి చెందిన విజయ్ కుమార్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగారు.
News January 11, 2026
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ

అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక రన్స్ చేసిన రెండో ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించారు. NZతో తొలి వన్డేలో కోహ్లీ ఈ ఫీట్ సాధించారు. సచిన్ 34,357 (782 ఇన్నింగ్సులు) పరుగులతో తొలి స్థానంలో ఉండగా, కోహ్లీ 28,027* (624 ఇన్నింగ్సులు) రన్స్‌తో రెండో స్థానంలో ఉన్నారు. అలాగే అత్యంత వేగంగా 28వేలకు పైగా రన్స్ (సచిన్ 644 ఇన్నింగ్సులు) చేసిన ఆటగాడిగా విరాట్ నిలిచారు.


