News December 30, 2025
భద్రాద్రి: మేడారం జాతరకు 203 ప్రత్యేక బస్సులు

మేడారం సమ్మక్క-సారక్క జాతరకు వెళ్లే భక్తుల కోసం భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ.. 203 బస్సులను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో అత్యధికంగా కొత్తగూడెం డిపో నుంచి 110 బస్సులు నడపనున్నారు. అలాగే ఇల్లందు నుంచి 41, భద్రాచలం 21, మణుగూరు 16, పాల్వంచ నుంచి 15 బస్సులను భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేశారు. జాతర రద్దీని బట్టి మరిన్ని సర్వీసులు పెంచే అవకాశం ఉందని, భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
Similar News
News January 2, 2026
KNR: రైతులు ఆందోళన చెందవద్దు: కలెక్టర్

కరీంనగర్ జిల్లాలో సాగు అవసరాలకు సరిపడా యూరియా నిల్వలు సిద్ధంగా ఉన్నాయని, రైతులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ఈ వారంలో వివిధ సొసైటీల ద్వారా 3,163 మెట్రిక్ టన్నుల యూరియాను అందుబాటులోకి తెచ్చామని, మరో 2,616 మెట్రిక్ టన్నుల నిల్వలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. అవసరానికి మించి కొనుగోలు చేయవద్దని, డిమాండ్‌ను బట్టి మరిన్ని నిల్వలు తెప్పిస్తామని ఆమె స్పష్టం చేశారు.
News January 2, 2026
పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేసిన కలెక్టర్

రాజముద్రతో ఉన్న పట్టాదారు పాసుపుస్తకాలను జిల్లాలోని రైతులకు అందజేయనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. గుడిపాల మండలం వసంతాపురం గ్రామంలో శుక్రవారం నిర్వహించిన రెవెన్యూ గ్రామసభలో ఆయన పాల్గొన్నారు. ఈనెల తొమ్మిది వరకు జిల్లావ్యాప్తంగా సచివాలయాల పరిధిలో గ్రామసభలు నిర్వహించి నూతన పుస్తకాలను అందజేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
News January 2, 2026
అయిజ: యూరియా కొరత లేదు- జిల్లా వ్యవసాయ అధికారి

గద్వాల జిల్లాలో యూరియా కొరత లేదని జిల్లా వ్యవసాయ అధికారి సక్రియ నాయక్ పేర్కొన్నారు. శుక్రవారం అయిజలో పర్యటించి పలు ఫర్టిలైజర్స్ దుకాణాలను ఆకస్మిక తనిఖీ చేశారు. యూరియా, ఎరువుల నిల్వలను పరిశీలించారు. స్టాక్ ఉన్నంతవరకు రైతులకు ఇబ్బంది కలగకుండా యూరియా, కాంప్లెక్స్ ఎరువులు విక్రయించాలని డీలర్లకు సూచించారు. యూరియా కొనుగోలు విషయంలో రైతులు ఎలాంటి అపోహలు నమ్మవద్దని తెలిపారు. ఏఈఓ శ్రీకాంత్ పాల్గొన్నారు.


