News December 30, 2025

జగిత్యాల అభ్యర్థులకు ఖమ్మంలో EXAM CENTER

image

టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TET)కు దరఖాస్తు చేసుకున్న జగిత్యాల జిల్లా అభ్యర్థులకు దూర ప్రాంతమైన ఖమ్మం జిల్లాలో పరీక్ష కేంద్రాలు కేటాయించడంపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నోటిఫికేషన్ విడుదలైన మొదటి రోజే దరఖాస్తు చేసుకున్నప్పటికీ, సమీప జిల్లాల్లో కాకుండా సుమారు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖమ్మంలో పరీక్షా కేంద్రాలు అలాటవ్వడం అన్యాయమన్నారు. మహిళలకు మరింత ఇబ్బందులు తలెత్తనున్నాయని అన్నారు.

Similar News

News December 31, 2025

విశాఖ: ప్లాస్టిక్ కవర్ కనిపిస్తే చాలు.. రూ.2,000 ఫైన్!

image

ఎంవీపీ కాలనీ సెక్టర్-9 చేపల మార్కెట్లో ప్లాస్టిక్ కవర్ల వినియోగంపై సూపర్వైజర్ సత్తిబాబు, సానిటరీ ఇన్స్పెక్టర్ రవి ఆకస్మిక తనిఖీలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ప్లాస్టిక్ వాడుతున్న వారికి రూ.2000 జరిమానా విధించారు. పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని ప్లాస్టిక్ సంచులను పూర్తిగా నిషేధించాలని, మళ్లీ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వారు ఈ సందర్భంగా హెచ్చరించారు.

News December 31, 2025

ట్రంప్, చైనా కామెంట్స్‌పై మోదీ స్పందించాలి: కాంగ్రెస్

image

ఇండియా-పాక్ మధ్య శాంతి కోసం మధ్యవర్తిత్వం చేశామని <<18718800>>చైనా చేసిన<<>> కామెంట్లపై ప్రధాని మోదీ స్పందించాలని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ డిమాండ్ చేశారు. ‘తానే యుద్ధాన్ని ఆపినట్టు పలు వేదికల్లో US అధ్యక్షుడు ట్రంప్ చాలాసార్లు చెప్పారు. తామే మధ్యవర్తిత్వం వహించామని ఇప్పుడు చైనా ఫారిన్ మినిస్టర్ చెబుతున్నారు. వాళ్లు చేస్తున్న కామెంట్లు మన దేశ భద్రతను అపహాస్యం చేస్తున్నట్టు ఉన్నాయి’ అని చెప్పారు.

News December 31, 2025

అక్కడ 26 గంటల తర్వాతే న్యూఇయర్!

image

ప్రపంచంలో అందరికంటే ముందుగా కిరిబాటి కొత్త ఏడాదికి స్వాగతం పలికితే చివరగా పసిఫిక్ సముద్రంలోని హౌలాండ్, బేకర్ దీవులు అడుగుపెడతాయి. కిరిబాటి కంటే ఇవి సుమారు 26 గంటలు ఆలస్యంగా వేడుకలు జరుపుకుంటాయి. దీనికి కారణం అంతర్జాతీయ దినరేఖ. భూమి గుండ్రంగా ఉండటం, టైమ్ జోన్స్ వేర్వేరుగా ఉండటంతో దినరేఖకు ఒకవైపు రోజు మొదలైతే, మరోవైపు ముగియడానికి గంటల సమయం పడుతుంది. ఇప్పటికే NZ న్యూఇయర్‌కు స్వాగతం పలికింది.