News April 24, 2024
అచ్చెన్నాయుడి ఆస్తుల వివరాలివే..

టెక్కలి అసెంబ్లి కూటమి అభ్యర్థి అచ్చెన్నాయుడు ఆస్తుల వివరాలను సోమవారం నామినేషన్ నేపథ్యంలో అఫిడవిట్‌లో పొందుపరిచారు. స్థిరాస్తులు: రూ.2,31,48,500 ఉండగా, చరాస్తులు: రూ. 1,32,05,511 ఉన్నట్లు వెల్లడించారు. అప్పులు: రూ.42,90,153, చేతిలో నగదు: రూ. 2,50,000, వివిధ బ్యాంకుల్లో: రూ.64,18,869 ఉన్నట్లు అఫిడవిట్‌లో చూపించారు.
Similar News
News December 13, 2025
15న టెక్కలిలో ప్రజా వేదిక: కలెక్టర్

ఈనెల 15న టెక్కలిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శనివారం తెలిపారు. టెక్కలి ఆర్డీఓ కార్యాలయ ఆవరణలోని నూతన సమావేశ మందిరంలో నిర్వహిస్తారని చెప్పారు. ఈ వేదికలో ప్రజలు అందించిన అర్జీలను పరిశీలించి పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News December 13, 2025
శ్రీకాకుళం: ‘లక్ష్యానికి దూరంగా ధాన్యం సేకరణ’

జిల్లాలో 30 మండలాల్లో ధాన్యం కొనుగోలు కోసం 406 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. 6,50,000 మెట్రిక్ టన్నులు సేకరణ లక్ష్యంగా నిర్ణయించారు. సంక్రాంతి లోపు వరి ధాన్యం నూర్పులు పూర్తి చేసి అమ్మటం రైతుల ఆనవాయితీ. ప్రస్తుతం పొలాల్లో వరి కుప్పలు దర్శనమిస్తున్నాయి. ధాన్యం అమ్మకం దళారులపై ఆధారపడే పరిస్థితి క్షేత్రస్థాయిలో ఉంది. ప్రభుత్వ మార్గదర్శకాల అమలు కావటం లేదని రైతులు అంటున్నారు.
News December 13, 2025
సంతబొమ్మాళి: రాకాసి అలలు..ప్రాణాలు తీశాయి

చేపల వేటకెళ్లిన మత్స్యకారుడు మృతి చెందిన ఘటన సంతబొమ్మాళి(M) భావనపాడులో శనివారం ఉదయం జరిగింది. తోటి జాలర్లతో వేటకెళ్లిన రాజయ్య(60) బలమైన కెరటాలకు తెప్ప నుంచి ప్రమాదవశాత్తూ సముద్రంలోకి పడిపోయాడు. పక్కనే ఉన్నవారు అప్రమత్తమై కాపాడేలోపే రాకాసి అలల తాకిడికి తనువు చాలించాడు. అనంతరం డెడ్ బాడీని ఒడ్డుకు తీసుకురాగా..సమాచారం తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.


