News December 30, 2025

అద్దంకి: ‘డోర్ డెలివరీ సౌకర్యాన్ని వినియోగించుకోవాలి’

image

అద్దంకి ఆర్టీసీ డిపో నుంచి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, గుంటూరు, నెల్లూరు, ఒంగోలు, కాకినాడ, చిత్తూరు కడప, అనంతపురానికి 50 కేజీల బరువు ఉన్న పార్సిళ్లకు డోర్ డెలివరీ సౌకర్యం ఉంటుందని డీఎం రామ్మోహన్ రావు మంగళవారం తెలిపారు. పట్టణ పరిధిలో 10 కిలోమీటర్ల వరకు ఈ సౌకర్యం ఉంటుందని చెప్పారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

Similar News

News December 30, 2025

FLASH: నల్గొండ కలెక్టర్‌గా సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్

image

సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ బదిలీ అయ్యారు. నల్గొండ జిల్లా కలెక్టర్‌గా పోస్టింగ్ ఇస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. చంద్రశేఖర్ మాట్లాడుతూ.. తాను జిల్లాలో ఎంతో ఆనందంగా పనిచేసినట్లు చెప్పారు. జిల్లాను ఎప్పటికీ మర్చిపోను అని పేర్కొన్నారు. నల్గొండ జిల్లా కలెక్టర్‌గా వెళ్తున్న చంద్రశేఖర్‌ను పలువురు ఉద్యోగులు సన్మానించారు.

News December 30, 2025

నల్గొండ కలెక్టర్‌గా బడుగు చంద్రశేఖర్

image

ఐఏఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ నూతన కలెక్టర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త కలెక్టర్ చంద్రశేఖర్ రేపు లేదా ఎల్లుండి నల్గొండలో బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. కాగా, ఇక్కడ పనిచేసిన ఇలా త్రిపాఠి నిజామాబాద్క కలెక్టర్‌గా బదిలీ అయ్యారు.

News December 30, 2025

నాచగిరి క్షేత్రంలో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు

image

వర్గల్ పరిధి నాచగిరి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో వైకుంఠ (ముక్కోటి) ఏకాదశి వేడుకలు మంగళవారం వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామునే దేవత మూర్తులను నాచగిరి పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ఆలయం ఉత్తర ద్వారం వద్ద అధిష్ఠింజేసి, భక్తులకు దర్శనం కల్పించారు. ఆలయ కమిటీ ఛైర్మన్ పల్లెర్ల రవీందర్ గుప్తా, ఈవో విజయ రామారావు పర్యవేక్షణలో వేడుకలు ఘనంగా జరిగాయి.