News April 24, 2024

ఏందయ్యా.. హార్దిక్ ఇది!!

image

IPL: ముంబై మరో మ్యాచ్ ఓడిపోవడంతో కెప్టెన్ హార్దిక్ పాండ్యపై ట్రోల్స్ ఎక్కువవుతున్నాయి. కెప్టెన్, బ్యాటర్, బౌలర్‌గా విఫలమవుతున్నారని ముంబై ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. బుమ్రా, కోయెట్జీ, తుషారా లాంటి టాప్ క్లాస్ బౌలర్లు ఉండగా.. హార్దిక్ ఫస్ట్ ఓవర్ వేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. బ్యాటింగ్‌లోనూ సరైన ఫినిష్ ఇవ్వట్లేదని, కెప్టెన్సీలోనూ తేలిపోతున్నారని పెదవి విరుస్తున్నారు. మరి హార్దిక్ ప్రదర్శనపై మీ కామెంట్?

Similar News

News March 22, 2026

మార్చి 22: చరిత్రలో ఈరోజు

image

1868: అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత రాబర్ట్ మిల్లికాన్ జననం
2000: ఇన్సాట్-3బీ ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించింది
2005: తమిళ నటుడు జెమినీ గణేశన్ మరణం
2009: సినీ నటుడు, నిర్మాత కాంతారావు మరణం (ఫొటోలో)
* ప్రపంచ జల దినోత్సవం

News March 22, 2026

బల్బ్‌లో కెమెరా.. డాక్టరే న్యూడ్ వీడియోలు తీసి

image

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఒక డాక్టర్ తన కొలీగ్‌పై ఉన్న వన్ సైడ్ లవ్‌తో నీచానికి ఒడిగట్టాడు. క్లినిక్ బల్బ్ హోల్డర్‌లో కెమెరా పెట్టి 3,000 ప్రైవేట్ వీడియోలను రికార్డ్ చేశాడు. వాటిని చూపించి ₹25 లక్షలు ఇవ్వాలని బ్లాక్‌మెయిల్ చేస్తూ వేధించాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు నిందితుడు డాక్టర్ కమల్ నందాతో పాటు మరో 12 మందిపై కేసులు నమోదు చేశారు.

News March 22, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.