News December 30, 2025
MNCL: రేపు డీసీసీ సర్వసభ్య సమావేశం

కాంగ్రెస్ మంచిర్యాల జిల్లా సర్వసభ్య సమావేశం బుధవారం నిర్వహిస్తున్నట్లు డీసీసీ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథరెడ్డి తెలిపారు. గద్దెరాగడిలోని భీమా గార్డెన్స్‌లో జరిగే ఈ సమావేశానికి రాష్ట్ర ఆయిల్ ఫెర్టిలైజర్ ఛైర్మన్ జంగా రాఘవ రెడ్డి, టీపీసీసీ కార్యదర్శులు రాంభూపాల్, రహమాతుల్లా హుస్సేన్ హాజరుకానున్నారని పేర్కొన్నారు. డీసీసీ కార్యవర్గం కోసం దరఖాస్తులు స్వీకరించనున్నట్లు చెప్పారు.
Similar News
News January 2, 2026
భద్రాద్రి: హిడ్మా ఎన్‌కౌంటర్ ఉదంతం.. లేఖ కలకలం

మావోయిస్టు అగ్రనేత మడివి హిడ్మా ఎన్‌కౌంటర్ ఉదంతంపై మావోయిస్టు పార్టీ విడుదల చేసిన లేఖ కలకలం రేపుతోంది. భద్రాచలానికి చెందిన ఓ అధికార పార్టీ నాయకుడి కుట్ర వల్లే హిడ్మా పట్టుబడ్డారని ఆ లేఖలో పేర్కొన్నారు. అనారోగ్యంతో ఉన్న హిడ్మాను ఆసుపత్రికి తరలిస్తానని నమ్మించి, పోలీసులకు సమాచారం ఇచ్చి రివార్డు సొమ్ము కోసం కుట్ర పన్నారని ఆరోపించారు.
News January 2, 2026
సిర్గాపూర్ SC హాస్టల్ వార్డెన్ సస్పెండ్

సిర్గాపూర్ SC హాస్టల్(బాలుర) వార్డెన్ కిషన్ నాయక్‌ను జిల్లా SC అభివృద్ధి అధికారి అఖిలేష్ రెడ్డి సస్పెండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు సంబంధిత శాఖ వర్గాలు తెలిపాయి. కాగా వార్డెన్ తమను నిత్యం వేధిస్తున్నాడంటూ, మద్యం తాగి బూతులు తిడుతున్నాడంటూ విద్యార్థులు నిన్న హాస్టల్ ముందు ధర్నా నిర్వహించిన విషయం తెలిసిందే. వ్యవహారం పెద్దది కావడంతో విచారణ అనంతరం సదరు వార్డెన్‌పై వేటు పడింది.
News January 2, 2026
దాడికి సిద్ధం.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్

ఇరాన్‌లో పోలీసుల కాల్పుల్లో ఏడుగురు <<18737357>>నిరసనకారులు<<>> మరణించడంపై US అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్న వారిపై కాల్పులు జరపడం ఇరాన్‌కు అలవాటే. దానిని వెంటనే ఆపాలి. లేకుంటే అమెరికా జోక్యం చేసుకోవాల్సి వస్తుంది. మేము లాక్ చేసి లోడ్ చేసుకుని దాడికి సిద్ధంగా ఉన్నాం’ అని పోస్ట్ చేశారు. ‘US జోక్యం చేసుకుంటే పరిస్థితులు ఉద్రిక్తంగా మారతాయి’ అని ఇరాన్ కౌంటరిచ్చింది.


