News December 30, 2025

కామారెడ్డి: జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల గడువు పొడిగింపు

image

జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల చెల్లుబాటును మరో రెండు నెలల పాటు పొడిగించినట్లు కామారెడ్డి జిల్లా పౌర సంబంధాల అధికారిణి తిరుమల మంగళవారం తెలిపారు. అర్హులైన జిల్లా మీడియా ప్రతినిధులు డిసెంబర్ 31న మధ్యాహ్నం 2 గంటలకు డీపీఆర్‌ఓ కార్యాలయంలో తమ కార్డులపై పొడిగింపు స్టిక్కర్లను వేయించుకోవాలని ఆమె సూచించారు.

Similar News

News December 31, 2025

టోల్ మినహాయించాలని లేఖ.. BRS విమర్శలు

image

TG: సంక్రాంతికి HYD-విజయవాడ మార్గంలో <<18708714>>టోల్<<>> మినహాయించాలని కేంద్రమంత్రి గడ్కరీకి మంత్రి కోమటిరెడ్డి లేఖ రాయడంపై BRS శ్రేణులు విమర్శలు గుప్పిస్తున్నాయి. ‘తెలంగాణ ప్రజలపై ఇదే దయ ఎందుకు చూపరు. HYDలో ఉన్న తెలంగాణ బిడ్డలు వరంగల్, కరీంనగర్, ADB, మహబూబ్ నగర్, నల్గొండ వైపులకు వెళ్లేందుకు రూ.వందల టోల్ ఫీజులు కడుతున్నారుగా. దసరా, బతుకమ్మకూ ఇదే మినహాయింపు ఇవ్వండి మరి’ అని సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నాయి.

News December 31, 2025

పోలవరం జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఇక్కడే

image

పోలవరం జిల్లా కేంద్రం అయిన రంపచోడవరం యువ శిక్షణ కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు ల్యాండ్ రెవెన్యూ చీఫ్ కమిషనర్ విజయలక్ష్మి ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారని అధికారులు తెలిపారు. రంపచోడవరం సమీపంలో సిరిగిందలపాడు వద్ద ఉన్న ఈ కేంద్రంలో రేపు ఉదయం 10.30కు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఏర్పాట్లు పూర్తి చేస్తారు.

News December 31, 2025

విజయవాడ: ఆద్విక ట్రేడింగ్ కేసులో ఏజెంట్ అరెస్ట్

image

చీటింగ్ కేసులో సంచలనం సృష్టించిన అద్విక ట్రేడింగ్ కంపెనీ ఏజెంట్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల మేరకు.. రామిరెడ్డి అనే వ్యక్తి హైదరాబాద్‌లో స్థిర పడ్డాడు. ఈ క్రమంలో ఆయన 140 మందిని ఆద్వికలో జాయిన్ చేసి రూ.2 కోట్ల మేర కమిషన్ రూపంలో పొందాడు. కమిషన్ తిరిగి ఇవ్వాలని పోలీసులు రామ్ రెడ్డిని కోరారు. ఆయన నిరాకరించడంతో వెంటనే అతనిని అరెస్ట్ చేశారు.