News December 30, 2025

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో 12వ స్థానంలో వనపర్తి

image

రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వనపర్తి జిల్లా 12వ స్థానంలో నిలిచింది. జిల్లాకు 6,500 ఇళ్లు మంజూరు కాగా, ఇప్పటికే 50 శాతం పనులు ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు. అయితే, గతంలోనే బేస్‌మెంట్‌ వరకు నిర్మించుకున్న 1,308 మంది పేదలకు మొదటి విడతలో నిధులు మంజూరు కాలేదు. వీరి జాబితా ప్రభుత్వం వద్దే ఉందని, వెంటనే ఆ ఇళ్లను మంజూరు చేయాలని పానుగల్‌కు చెందిన లబ్ధిదారులు కోరుతున్నారు.

Similar News

News January 1, 2026

HYDలో కొత్త ట్రెండ్.. ఇదే బెస్ట్ స్పాట్..!

image

HYD‌లో ఏ వేడుక జరిగినా ఇప్పుడు అందరి చూపు డాక్టర్‌ బీ.ఆర్. అంబేడ్కర్ సెక్రటేరియట్ వైపే ఉంటోంది. IPL‌లో RCB విజయం, న్యూ ఇయర్ వేడుకలను సీపీ సజ్జనార్ ఇక్కడే జరుపుకోవటం విశేషం. సెక్రటేరియట్ అద్భుతమైన నిర్మాణ శైలి, విద్యుత్ వెలుగులతో ఈ ప్రాంతం పర్యాటకానికి ‘బెస్ట్ స్పాట్’గా మారింది. అమరజ్యోతి, భారీ అంబేడ్కర్ విగ్రహం, హుస్సేన్ సాగర్ అందాలను వీక్షించేందుకు సందర్శకులు పోటెత్తుతున్నారు.

News January 1, 2026

శాతవాహన మహిళా సెల్ డైరెక్టర్‌గా డా.నమ్రత

image

శాతవాహన విశ్వవిద్యాలయ మహిళా సెల్ డైరెక్టర్గా రసాయన శాస్త్ర సహా ఆచార్యులుగా పనిచేస్తున్న డాక్టర్ వి.నమ్రతకు VC ఆచార్య ఉమేష్ కుమార్ ఉత్తర్వులు అందజేశారు. డా.నమ్రత 2008లో సహాయ ఆచార్యులుగా రసాయన శాస్త్ర విభాగం సైన్స్ కళాశాలలో నియామకం పొంది ఆ కళాశాల ప్రిన్సిపల్గా పనిచేశారు. డా.నమ్రత మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయంలో మహిళా అధ్యాపకుల విద్యార్థుల సమస్యలను పరిష్కరించడానికి తనవంతు ప్రయత్నం చేస్తానన్నారు.