News December 30, 2025

గరుడ గమన తవ విష్ణు స్తోత్రం రాసింది ఎవరో తెలుసా.?

image

ముక్కోటి ఏకాదశి సందర్భంగా దేవాలయాలలో గరుడ గమన తవ.. చరణ కమల మిహా మనసిత సతు మల నిత్యం.. మహతాపము మా పా కురుదేవ.. మహా పాపమ మా పా కురుదేవ స్తోత్రం విస్తృతంగా వినపడుతుంది. ఈ మహా విష్ణు స్తోత్రాన్ని శృంగేరి శంకరమఠం పీఠాధిపతి జగద్గురు శ్రీ భారతి తీర్థానంద స్వామి రచించారు. స్వామిజి పల్నాడు జిల్లాకు చెందినవారు. స్వామీజీ పల్నాడు జిల్లాలోనే విద్యాభ్యాసం చేశారు. ఇప్పటికీ నరసరావుపేటలో శృంగేరి శంకర మఠం ఉంది.

Similar News

News January 1, 2026

NLG: పరీక్షల టైం టేబుల్ విడుదల

image

మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం పరిధిలో జరగబోయే LLB, (B.Com/B.A) రెగ్యులర్ సెమిస్టర్-1 సంబంధించిన ఎగ్జామ్స్ టైం టేబుల్‌ను గురువారం కంట్రోలర్ అఫ్ ఎగ్జామినేషన్ డా.ఉపేందర్ రెడ్డి విడుదల చేశారు. పరీక్షలు ఈ నెల 7 నుంచి 19 తేదీ మధ్య జరుగుతాయని ఆయన తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు కాలేజీ ఐడీ కార్డ్, హాల్ టిక్కెట్లతో పరీక్షా కేంద్రాలకు హాజరు కావాలని ఆయన సూచించారు.

News January 1, 2026

AMP: పరస్పర శుభాకాంక్షలు తెలుపుకున్న కలెక్టర్, ఎస్పీ

image

నూతన సంవత్సరం పురస్కరించుకొని అమలాపురంలో కలెక్టర్ మహేశ్ కుమార్‌ను ఎస్పీ రాహుల్ మీనా గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు ఎస్పీ పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్ కూడా ఎస్పీకి నూతన సంవత్సర అభినందనలు తెలియజేశారు. కొత్త ఏడాదిలో జిల్లా ప్రజలందరికీ అంతా మంచే జరగాలని, అభివృద్ధి పథంలో జిల్లా ముందుకు సాగాలని వారు ఆకాంక్షించారు.

News January 1, 2026

ఈ నెల 3న మల్లన్న వార్షిక ఆరుద్రోత్సవం

image

ఈ నెల 3న లోక కల్యాణార్థమై శ్రీశైలంలో శ్రీ స్వామివారికి వార్షిక ఆరుద్రోత్సవం నిర్వహించనున్నారు. ఆరుద్రోత్సవాన్ని ప్రతి నెలలో మాసోత్సవంగా నిర్వహిస్తుండగా, ధనుర్మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజున మాత్రం వార్షిక ఆరుద్రోత్సవం నిర్వహిస్తారు. 2న రాత్రి 10 గంటల నుండి శ్రీస్వామివారికి మహాన్యాస పారాయణ, లింగోద్భవకాల ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, 3న నందివాహన సేవ, గ్రామోత్సవం జరిపిస్తారు.