News December 30, 2025
2025: కడప జిల్లా నేరాల గణాంకాలు ఇవే.! (2/4)

✎ అక్రమ ఎర్రచందనం రవాణాలో 9 కేసులు నమోదు చేసి 55 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో 1979 కేజీల 139 దుంగలను, 5 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
✎ గంజాయి విక్రయాలపై చేసిన దాడుల్లో 22 కేసులు నమోదు చేసి 67 మందిని అరెస్ట్ చేశారు. 46.27 కిలోల గంజాయిని స్వాధీనం.
✎ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 77,899 కేసులు నమోదు చేసి రూ.2,06,82,743 జరిమానాలు విధించారు.
<<18714488>>CONTINUE<<>>
Similar News
News January 13, 2026
సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ

సంక్రాంతి పండగను పురస్కరించుకుని ప్రజలు, పోలీస్ సిబ్బందికి ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంటిల్లిపాది సంతోషంగా సంక్రాంతి పండుగను నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల జోలికెళ్లకుండా భోగి, మకర సంక్రాంతి, కనుమను ఆనందంగా జరుపుకోవాలని కోరారు.
News January 13, 2026
కడప జిల్లాలో 99,508 హెక్టార్లలో రబీ పంటల సాగు

జిల్లాలో రబీ పంటల సాగు సాధారణ విస్తీర్ణం 1,39,796 హెక్టార్లు కాగా, ఈ ఏడాది
99,508 హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. పప్పు సెనగ 68,207, మినుము 12,421, మొక్కజొన్న 5,390, వరి 4,223, జొన్న 2,110, కుసుమ 1.970, వేరుశనగ 1,259, గోధుమ 28, సజ్జ 783, రాగి 115, కొర్ర 81, కంది 143, పెసర 949, ప్రొద్దుతిరుగుడు 422, పత్తి 248 హెక్టార్లలో సాగయ్యింది. గత ఏడాది 1,10,776 హెక్టార్లలో సాగైనట్లు అధికారులు తెలిపారు.
News January 13, 2026
కడప జిల్లాలో డ్రైనేజీల అభివృద్ధికి నిధులు మంజూరు

కడప జిల్లాలోని మున్సిపాలిటీల్లో డ్రైనేజీల ఆధునీకరణ, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ప్రొద్దుటూరు మునిసిపాలిటీకి రూ.65.09 కోట్లు నిధులు మంజూరయ్యాయని స్థానిక మునిసిపల్ కమిషనర్ రవిచంద్ర రెడ్డి తెలిపారు. కడపకు రూ.100 కోట్లు, బద్వేల్ రూ.31.97 కోట్లు, రాజంపేట రూ.21.62 కోట్లు, జమ్మలమడుగు రూ.21.16 కోట్లు, పులివెందుల రూ.28.91 కోట్లు, ఎర్రగుంట్ల రూ.38.06 కోట్లు మంజూరయ్యాయన్నారు.


