News December 30, 2025

విజయవాడలో ‘న్యూ ఇయర్’ ఆంక్షలు

image

నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో నగరంలో పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు. 31వ తేదీ రాత్రి బెంజ్ సర్కిల్, కనకదుర్గ ఫ్లైఓవర్‌ సహా అన్ని వంతెనలను మూసివేస్తున్నట్లు సీపీ రాజశేఖర్ బాబు తెలిపారు. శాంతిభద్రతల దృష్ట్యా ఈ నిబంధన జనవరి 13 వరకు రాత్రి వేళల్లో అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని వెల్లడించారు.

Similar News

News January 11, 2026

రేపు కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ కార్యక్రమం: కలెక్టర్

image

అనంతపురం జిల్లా కలెక్టరేట్‌లో ఈనెల 12న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ శివ నారాయణ శర్మ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లా ప్రజలు తమ సమస్యలను అర్జీల ద్వారా అందజేయాలన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.

News January 11, 2026

చిత్తూరు జిల్లా ప్రజలకు గమనిక

image

చిత్తూరు కలెక్టరేట్లో సోమవారం జరగనున్న గ్రీవెన్స్ డేను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ కోరారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు కార్యక్రమం జరగనుందని చెప్పారు. జిల్లా అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో తెలియజేస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. అర్జీ నమోదు, స్థితిపై 1100కి కాల్ చేయవచ్చన్నారు.

News January 11, 2026

డిప్యూటీ సీఎంకు హరీష్ రావు లేఖ

image

సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజ్‌లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వెంటనే వేతనాలు ఇవ్వాలని డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కకు మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. 9 నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో వారి కుటుంబ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. బతుకమ్మ, దసరా, దీపావళి పండుగలకు కనికరం చూపలేదని ఈ సంక్రాంతికైనా స్పందించాలని కోరారు.