News December 30, 2025

హైదరాబాద్‌పై నిజామాబాద్ గెలుపు

image

కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ T-20 క్రికెట్ లీగ్ టోర్నీలో NZB జట్టు HYDపై 39 పరుగుల తేడాతో గెలుపొందింది. HYDలోని ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన NZB జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన HYD జట్టు 9 వికెట్లను కోల్పోయి 144 పరుగులు చేసింది. దీంతో NZB జట్టు 39 పరుగుల తేడాతో గెలుపొందింది.

Similar News

News February 18, 2026

నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఆదేశాలు

image

నందిపేట్ మండల కేంద్రంలో నిర్మిస్తోన్న భవిత సెంటర్‌ను నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం సందర్శించారు. పనులను వేగంగా, నాణ్యతతో జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ చేయాలని ఇంజినీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు. చిన్నారులకు అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ర్యాంపు వంటి వసతులు తప్పనిసరిగా ఉండాలన్నారు.

News February 18, 2026

నిజామాబాద్: యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

image

నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం ఫకీరాబాద్ సమీపంలో బైక్ యాక్సిడెంట్ జరిగి గణపతి అనే వ్యక్తి మరణించాడని ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. ఈనెల 9న సాయంత్రం బైక్‌పై బోధన్ నుంచి బాసర వెళ్తుండగా మార్గమధ్యలో ఫకీరాబాద్ సమీపంలో బైక్ స్కిడ్ అయి తీవ్రంగా గాయపడ్డారన్నారు. అనంతరం గణపతి నిజామాబాద్‌లో చికిత్స పొందుతూ ఈరోజు మృతిచెందారని చెప్పారు. మృతుడి భార్య సువర్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పేర్కొన్నారు.

News February 18, 2026

NZB: వార్షిక పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

image

10వ తరగతి, ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణకు సంబంధించి చేపట్టాల్సిన చర్యలపై బుధవారం కలెక్టరేట్‌లో సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించగా కలెక్టర్ మాట్లాడారు. ఎలాంటి లోటుపాట్లను తావులేకుండా పరీక్షలను సజావుగా కొనసాగేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.