News December 30, 2025

3 పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన ఎస్పీ నితికా పంత్

image

ఆసిఫాబాద్‌ జిల్లాలోని పోలీసు స్టేషన్ల పనితీరును మెరుగుపరిచేందుకు SP నితికా పంత్ తనిఖీలను వేగవంతం చేశారు. ఇస్గాం,పెంచికల్‌పేట్,దాహేగాం ఠాణాలను ఆకస్మికంగా సందర్శించారు. ఈసందర్భంగా స్టేషన్‌లోని వివిధ విభాగాలు, నేరాలకు సంబంధించిన రికార్డులు, రిజిస్టర్లు, జనరల్ డైరీలను క్షుణ్ణంగా పరిశీలించారు. గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలు సాగకుండా కఠినచర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. DSP వహీదుద్దీన్ ఉన్నారు.

Similar News

News January 3, 2026

పల్నాడు జిల్లాలో 100 ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

పల్నాడు జిల్లాలో 100 ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. టైప్-3 కస్తూర్బాగాందీ విద్యాలయాల్లో (KGVB) 62, టైప్-4 కేజీబీవీల్లో 38 నాన్ టీచింగ్ పోస్టింగ్‌లను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఇవాళ్టి నుంచి జనవరి 11వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అప్లికేషన్లు జిల్లా కేంద్రంలోని సమగ్ర శిక్ష కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు.

News January 3, 2026

నల్గొండ: 10 నెలలు.. 1,47,184 రేషన్ కార్డులు

image

ఉమ్మడి నల్గొండలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. గడిచిన 10 నెలల్లోనే ప్రభుత్వం కొత్తగా 1.47 లక్షల మందికి పైగా కార్డులను మంజూరు చేసింది. గత జనవరిలో 10.06 లక్షలుగా ఉన్న కార్డుల సంఖ్య ఇప్పుడు భారీగా పెరిగింది. దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులని తేలితే చాలు, అధికారులు వెంటనే కార్డులను ఓకే చేస్తున్నారు. ఫిబ్రవరి నుంచి డిసెంబర్ 22 వరకు 1,47,184 కార్డులు జారీ అవ్వడం గమనార్హం.

News January 3, 2026

విశాఖ జిల్లాలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

విశాఖ జిల్లాలో 20 ఉద్యోగాలకు ప్రభుత్వం <>నోటిఫికేషన్<<>> ఇచ్చింది. కేజీబీవీ టైప్-3 విభాగంలో 06, టైప్-4 విభాగంలో 14 నాన్ టీచింగ్ పోస్టింగ్‌లను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఇవాళ్టి నుంచి జనవరి 11వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అప్లికేషన్లు జిల్లా కేంద్రంలోని సమగ్ర శిక్ష కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు.