News December 30, 2025
జగిత్యాల వ్యవసాయ మార్కెట్ ధరలు

జగిత్యాల వ్యవసాయ మార్కెట్‌లో నేడు పలికిన వివిధ దినుసుల ధరలు ఇలా ఉన్నాయి. మక్కలు క్వింటాల్‌కు గరిష్ఠ ధర రూ.1976, కనిష్ఠ ధర రూ.1976, వరి ధాన్యం 1010 గరిష్ఠంగా రూ.1950, కనిష్ఠ ధర రూ.1850, జైశ్రీరాం వరి ధాన్యం గరిష్ఠ ధర రూ.2711, కనిష్ఠ ధర రూ.2711 ధర పలికింది. నేడు మార్కెట్‌లో 32 బస్తాల కొనుగోళ్లు జరిగినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు.
Similar News
News January 9, 2026
వరంగల్: 5 కొత్త లేఅవుట్లకు అనుమతి

కొత్త లేఅవుట్ల ఏర్పాటుకు జిల్లా లేఅవుట్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ సత్యశారద, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ ఐదు లేఅవుట్లకు తుది అనుమతులు మంజూరు చేశారు. పైడిపల్లి, దేశాయిపేట, స్తంభంపల్లి, నక్కలపల్లి, తిమ్మాపూర్ గ్రామాల్లో నిబంధనలకు అనుగుణంగా ఉన్న లేఅవుట్లను పరిశీలించి ఆమోదం తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి పాల్గొన్నారు
News January 9, 2026
విశాఖలో ఆ భూములను టచ్ చేయాలంటే భయం..!

నిషేధిత జాబితా 22-Aలో చేరిన భూములను తొలగించేందుకు అధికారులు ముందుకు రావడం లేదు. IAS అధికారులు సైతం వీటికి దూరంగా ఉంటున్నారు. విశాఖలో 80కి పైగా ఇలాంటి ఫైల్స్ ఉన్నాయి. ఈ జాబితా నుంచి తమ భూములను తొలగించాలని దరఖాస్తులు చేస్తున్నా.. MRO, RDO, కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నా ఏదో ఒక కారణంతో తిరస్కరణకు గురవుతున్నాయి. ఈ ఫైల్స్‌లోని కొన్నింటిలో తప్పుడు పత్రాలు సృష్టించినవి ఉండటంతో అధికారులు సాహసించడం లేదు.
News January 9, 2026
బాపట్ల: భార్యను చంపాడు.. చివరికి.!

నిజాంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో 2022లో జరిగిన భార్య హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు, రూ.2 వేల జరిమానా విధిస్తూ తెనాలి 11వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. భార్యను హత్య చేసిన భర్తకు కఠిన శిక్ష పడేలా సమగ్ర దర్యాప్తు, బలమైన సాక్ష్యాలు అందించిన పోలీసు అధికారులను ఎస్పీ బి.ఉమామహేశ్వర్ అభినందించారు. నేరస్తులకు శిక్షలు పడితేనే బాధితులకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.


