News December 30, 2025
పాలమూరు: సంపులో పడి 18 నెలల బాలుడి మృతి

మామిడి తోటలోని నీటి సంపులో పడి ఓ బాలుడి మృతి చెందిన విషాద ఘటన కల్వకుర్తి మండలం మాచర్లలో చోటుచేసుకుంది. వంగూరు మండలానికి చెందిన మల్లేష్, మంజుల దంపతులు మాచర్లలో మామిడి తోటను కౌలుకు తీసుకున్నారు. మంగళవారం పనుల నిమిత్తం తమ 18 నెలల కుమారుడు హర్షిత్‌ను తోటలోకి తీసుకెళ్లారు. ఆడుకుంటూ వెళ్లిన బాలుడు ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి ప్రాణాలు కోల్పోయాడు. బాలుడి మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
Similar News
News January 7, 2026
US బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి!

ఇటీవల వెనిజులా అధ్యక్షుడు మదురో అరెస్ట్ వేళ US ఆర్మీ చేసిన మెరుపుదాడిలో 55 మంది వెనిజులా, క్యూబా సైనికులు చనిపోయినట్లు ఇరుదేశాలు ప్రకటించాయి. వీరిలో వెనిజులాకు చెందిన 23, క్యూబా సైనికులు 32మంది ఉన్నట్లు పేర్కొన్నాయి. మృతిచెందిన తమ సైనికుల వయసు 26-27ఏళ్ల మధ్య ఉంటుందని క్యూబా చెప్పింది. అటు ఈ దాడుల్లో మదురో భద్రతా సిబ్బంది చాలా వరకు చనిపోయినట్లు వెనిజులా రక్షణ మంత్రి పాడ్రినో లేపెజ్ తెలిపారు.
News January 7, 2026
ధనుర్మాసం: ఇరవై మూడో రోజు కీర్తన

ఈ పాశురం కృష్ణుడి రాకను వర్ణిస్తుంది. సింహం మేల్కొన్నాక జూలు విదిల్చి గర్జిస్తూ బయటకు వచ్చినట్లు కృష్ణుడు తన శయనం నుంచి లేచి రావాలని గోపికలు కోరుతున్నారు. సింహంలా శత్రువులను హడలెత్తించే పరాక్రమం ఉన్నా, భక్తులతో సుందరంగా, దయతో వ్యవహరించే స్వామిని తమ అభీష్టాలను వినమని వేడుకుంటున్నారు. సింహాసనాన్ని అలంకరించి, తమ మొర ఆలకించి, మోక్షాన్ని ప్రసాదించమని ఆండాళ్ తల్లి స్వామిని ఆహ్వానించింది. <<-se>>#DHANURMASAM<<>>
News January 7, 2026
కామారెడ్డి: ఈనెల 8న జాబ్ మేళా

కామారెడ్డి జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పించేందుకు ఈనెల 8న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి కిరణ్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్ ఆవరణలోని కార్యాలయంలో అపోలో ఫార్మసీలో గల 108 పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు ఉంటాయని పేర్కొన్నారు. అర్హత గల అభ్యర్థులు తమ ధృవపత్రాలతో హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


